గణేశుడికి ఎందుకు పూజ చేయరాదు?

Tulsi Leaves: వినాయకుడి పూజలో తులసి ఆకులను వాడకపోవడానికి పురాణాల ప్రకారం ఒక ఆసక్తికరమైన కథ ఉంది. తులసిని వినాయకుడికి ఎందుకు సమర్పించకూడదో వివరించే కథ ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకసారి గంగా నది తీరంలో గణపతి తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో, ధర్మధ్వజుడు అనే రాజు కుమార్తె అయిన తులసి, వివాహ సంబంధం కోసం తీర్థయాత్రలు చేస్తూ ఆ ప్రాంతానికి వస్తుంది. అప్పుడు తపస్సులో ఉన్న గణపతిని చూసి, ఆయన అందానికి ముగ్ధురాలై, తనను పెళ్లి చేసుకోవాలని అడుగుతుంది.

అయితే గణపతి తాను ఆజన్మ బ్రహ్మచారినని, పెళ్లి చేసుకోలేనని చెబుతారు. దీనికి కోపగించుకున్న తులసి, నీకు రెండు పెళ్లిళ్లు అవుతాయి అని గణపతిని శపిస్తుంది. ఆ శాపానికి ఆగ్రహించిన గణపతి, "నువ్వు రాక్షసుడిని పెళ్లి చేసుకుంటావు, ఆ తర్వాత మొక్కగా మారిపోతావు" అని తులసిని ప్రతిశాపం ఇస్తారు.

ఆ శాపానికి తులసి భయపడి, గణపతిని క్షమించమని వేడుకుంటుంది. అప్పుడు గణపతి శాంతించి, "నీవు మొక్కగా మారిన తర్వాత, కలియుగంలో నీకు మోక్షం లభిస్తుంది. అయితే నా పూజలో మాత్రం నీవు ఉపయోగపడవు" అని చెబుతారు. అప్పటినుంచి గణపతి పూజలో తులసిని వాడటం నిషిద్ధం అయిపోయింది.

అందుకే వినాయక చవితి రోజున జరిపే 21 రకాల పత్రి పూజలో కూడా తులసి దళం ఉండదు. అయితే, కొన్ని పురాణాల ప్రకారం, వినాయక చవితి రోజున మాత్రమే ఈ నియమానికి మినహాయింపు ఉందని కూడా చెబుతారు. కానీ చాలామంది తులసిని వినాయకుడి పూజకు పూర్తిగా వాడకూడదని నమ్ముతారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story