White Clothes Are Worn at Funerals: అంత్యక్రియల్లో తెల్లని దుస్తులు ఎందుకు ధరిస్తారు? మతపరమైన ప్రాముఖ్యత ఇదే!
మతపరమైన ప్రాముఖ్యత ఇదే!

White Clothes Are Worn at Funerals: మరణం అనేది మన జీవితంలోని అత్యంత కఠినమైన సత్యం, దీనిని ప్రతి వ్యక్తి అంగీకరించక తప్పదు. పుట్టిన ప్రతి జీవికి మరణం ఒక రోజు ఖచ్చితం. మనమందరం ఈ సత్యాన్ని అంగీకరించి జీవితంలో ముందుకు సాగాలి. మీరు చాలాసార్లు అంత్యక్రియలకు లేదా సమాధికి హాజరైనట్లయితే అక్కడ తెల్లటి బట్టలు ధరించిన వ్యక్తులను చూసి ఉంటారు. విచారకరమైన సందర్భంలో తెల్లటి దుస్తులు ధరించడం వెనుక కేవలం సంప్రదాయం మాత్రమే కాక బలమైన మతపరమైన ప్రాముఖ్యత, నమ్మకం కూడా ఉన్నాయి.
తెలుపు రంగు యొక్క ఆధ్యాత్మిక అర్థం
మన సనాతన ధర్మంలో అంత్యక్రియల సమయంలో తెల్లని దుస్తులు ధరించే సంప్రదాయం చాలా పాతది. తెల్లని దుస్తులు ధరించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలు, నమ్మకాలు ఇక్కడ ఉన్నాయి:
శాంతి, స్వచ్ఛత - ఆధ్యాత్మిక శక్తికి చిహ్నం
తెలుపు రంగు శాంతి, స్వచ్ఛత, ఆధ్యాత్మిక శక్తిని సూచిస్తుందని నమ్ముతారు.
అందువల్ల, అలాంటి విచారకరమైన సందర్భాలలో తెల్లని దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తారు.
కుటుంబానికి మనశ్శాంతి
దుఃఖ సమయాల్లో తెల్లని దుస్తులు ధరించడం అనేది మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులకు మనస్సును ప్రశాంతపరచడానికి, మనశ్శాంతిని అందించడానికి ఒక మార్గంగా పరిగణించబడుతుంది.
ధర్మానికి ప్రాతినిధ్యం
హిందూ మతంలో..సత్యం, జ్ఞానం, సద్భావన అనేవి జీవితంలోని మూడు ప్రధాన ధర్మాలుగా పరిగణించబడతాయి మరియు తెలుపు రంగు వాటిని సూచిస్తుంది. మరణం అనేది జీవితపు అంతిమ సత్యాన్ని అంగీకరించడానికి గుర్తు.
కొత్త ప్రయాణానికి స్వాగతం
మరణం తరువాత ఆత్మ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తుందని నమ్ముతారు. తెల్లని దుస్తులు ధరించడం ద్వారా, కుటుంబ సభ్యులు ప్రశాంతమైన మరియు స్వచ్ఛమైన వాతావరణాన్ని కొనసాగిస్తారు. దీని వలన మరణించిన ఆత్మ శాంతిని అనుభవించి, శాంతితో తన ప్రయాణాన్ని కొనసాగించడానికి సహాయపడుతుంది.
అంత్యక్రియల సమయంలో తెల్లని దుస్తులు ధరించడం అనేది కేవలం ఒక సంప్రదాయం కాదు. ఇది దుఃఖాన్ని అంగీకరించడానికి, ఆత్మ శాంతిని కోరడానికి, పవిత్రమైన వాతావరణాన్ని కొనసాగించడానికి ఉపయోగపడే ఒక లోతైన ఆధ్యాత్మిక ఆచారం.

