Devotional: రాజన్న గుళ్లో భీమన్న.. వేములవాడ మహిమలు ఇవే!
వేములవాడ మహిమలు

Devotional: దక్షిణ కాశీగా పిలువబడుతున్న శైవ క్షేత్రాలలో వేములవాడ ఒకటి. రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఈ దేవాలయంలో శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేతుడై రాజరాజేశ్వరుడు లింగరూపంలో వెలసి నిత్యం పూజలందుకుంటున్నాడు. భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పిలవబడే ఈ క్షేత్రం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వరఖండంలో చెప్పబడింది. ఇక్కడ భీమేశ్వర ఆలయం కూడా ఉంది.
రాజరాజేశ్వరస్వామి ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఆలయాన్ని చూసిరమ్మని తన తమ్ముడు భీమన్నను పంపితే ఆలయ నిర్మాణానికి మగ్ధుడై అయిపోయిన ఆయన ఇక్కడే ఉండిపోతానని భీష్మించుకొని కూర్చున్నాడట. ఆ విషయం తెలిసే రాజన్న ఆగ్రహించి పెద్ద ఆలయంలో ఉన్న భీమన్నను దర్శించుకోవాలంటే ముందు తనను దర్శించుకోవాల్సిందేనని భీమన్నకు శాపం ఇచ్చాడని భక్తులు చెబుతుంటారు.
శివరాత్రి రోజున మూడు లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. సుమారు వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుపుతారు. అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. రాత్రివేళ దీపాలంకరణలతో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. విద్యార్థులకు ఉచిత వసతి, భోజన ఏర్పాట్లు చేస్తారు. ఇంకా, ఈ దేవాలయం ఇతర చిన్న ఆలయాలకు దానధర్మాలు చేస్తుంది.
శివరాత్రి రోజున వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుగుతుంది. అమావాస్య దాటి ఏకాదశి మొదలైన అర్ధరాత్రివేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు.
ఇక్కడ భక్తులు చేసే పూజల్లో ప్రముఖమైనది కోడె మొక్కు . భక్తులు గిత్తను తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి ప్రాంగణంలో కట్టేసి, ఆ గిత్తను దేవాలయానికిదక్షిణగా ఇచ్చేస్తారు. దీనివల్ల సంతానప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తారు.
శైవులు, వైష్ణవులు, జైనులు, బౌద్ధులు అందరూ ఈ దేవాలయాన్ని దర్శిస్తారు. దేవాలయంపై ఉన్న శిల్పాలు కూడా జైన, బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ ఉంటాయి.
దేవాలయ ప్రాంగణంలో 99 ఏళ్ళ నాటి మసీదు ఉంది. ఇస్లాం మతానికి ఏమండీ చెందిన ఒక శివభక్తుడు ఈ గుళ్ళో ఉంటూ, స్వామిని సేవిస్తూ ఇక్కడే మరణించాడట. అతని స్మృత్యర్ధం ఈ మసీదు నిర్మించారట. గుందెల్లి పర్షరం గరు గౌథం
దేవాలయ ప్రాంగణంలో కోటి శివలింగాలు ఉంటాయి అని విశ్వసిస్తారు.
