This Week horoscope : ఈ వారం మీ రాశి ఫలాలు
రాశిఫలాలు 13.07.25 నుండి 19.07.25 వరకు

–––––––––––––––––––
పండగలు – పర్వదినాలు ...
––––––––––––––––––––––
14, సోమవారం, సంకటహర చతుర్ధి
16, బుధవారం, కర్కాటక సంక్రమణం.
17, గురువారం, దక్షిణాయనం ప్రారంభం
––––––––––––––––––––––––––––
మేషం... (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఇంటాబయటా మీదే పైచేయిగా నిలుస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. కాంట్రాక్టర్లకు ఉత్సావంతంగా ఉంటుంది. వ్యాపారాలలో అనుకున్న విధంగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తీరతాయి. పారిశ్రామికవేత్తలకు కొన్ని కొత్త ప్రాజెక్టులు సాధిస్తారు. రాజకీయవేత్తలకు అనుకున్న పదవులు, హోదాలు లభిస్తాయి. కళాకారులు సన్మానాలు పొందుతారు. విద్యార్థులు ఊహించని అవకాశాలు దక్కుతాయి. 16,17 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు.బంధువులతో అకారణంగా తగాదాలు.ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఆంజనేయదండకం పఠించండి.
వృషభం... (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, వృగశిర 1,2 పాదాలు)
కొన్ని కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. ఆలోచనలు అంతగా కలసిరావు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకుంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. పెట్టుబడుల అన్వేషణలో విజయం సాధిస్తారు. ఉద్యోగులలో విధులు సజావుగా సాగుతాయి. రాజకీయవర్గాల వారికి విదేశీ పర్యటనలు ఫలప్రదమవుతాయి. కళాకారులకు అవార్డులు అందుతాయి. వ్యవసాయదారులకు ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది. విద్యార్థులకు సాంకేతికపరమైన విద్యలలో ప్రవేశం తథ్యం. 13,14 తేదీల్లో ఆరోగ్యభంగం. రాబడి నిరుత్సాహపరుస్తుంది. పనులలో జాప్యం. శ్రీదుర్గాస్తోత్రాలు పఠించండి.
మిథునం... (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు).
ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు. నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. చిరకాల స్వప్నం నెరవేరే సమయం. శ్రేయోభిలాషులు సహాయసహకారాలు అందిస్తారు. రహస్య విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణయత్నాలు అనుకూలిస్తాయి. పెట్టుబడులకు ఢోకా లేదు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాల వారు సత్కారాలతో బిజీగా గడుపుతారు. కళాకారులు అందిన అవకాశాలు సంతృప్తినిస్తాయి. పారిశ్రామికవర్గాలకు గతం కంటే అనుకూల కాలం. విద్యార్థులు కొత్త కోర్సులలో అవకాశాలు దక్కుతాయి. 14,15 తేదీల్లో దూరప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వ్యయప్రయాసలు. విష్ణుసహస్రనామ పారాయణ మంచిది.
కర్కాటకం... (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష).
కొత్త కార్యక్రమాలు చేపడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. భవనాలు, వాహనాలు కొంటారు. ఉద్యోగయత్నాల సానుకూలమవుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు కోరుకున్న విధంగా పదోన్నతులు దక్కుతాయి. రాజకీయవర్గాల వారికి పదవులు ఊరిస్తాయి. కళాకారులకు గౌరవ పురస్కారాలు పొందుతారు. విద్యార్థులు కొత్త పరిశోధనలపై దృష్టి సారిస్తారు. 16,17 తేదీల్లో ఇంటాబయటా విమర్శలు. కుటుంబంలో చికాకులు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రీగణేశాష్టకం పఠించండి.
సింహం.... (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
పట్టుదలతో ఎంతటి కార్యక్రమమైనా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. సంఘంలో ప్రత్యేకతను చాటుకుని గుర్తింపు పొందుతారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహంతో అడుగువేస్తారు. పారిశ్రామికవేత్తలకు ఎంతకాలంలో పెండింగ్లో ఉన్న అనుమతులు లభిస్తాయి. కళాకారులకు కొత్త అవకాశాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయవర్గాలకు .పదవులు దగ్గరకు వస్తాయి. ప్రజాదరణ పెరుగుతుంది. విద్యార్థులు పట్టుదలతో అనుకున్న అవకాశాలు సాధిస్తారు. 17,18 తేదీల్లో వివాదాలకు దూరంగా ఉండండి. నరాల సంబంధిత రుగ్మతలు. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. శ్రీదత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
కన్య... (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
అదనపు ఆదాయం సమకూరుతుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలకు తగిన గుర్తింపు పొందుతారు. అనుకున్నది సాధిస్తారు. కొత్త ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ఆహ్వానాలు, గ్రీటింగ్లు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు ఉన్నాయి. కళాకారులకు రెండుమూడు అవకాశాలు దగ్గరకు వస్తాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవీయోగాలు. విద్యార్థుల పరిశోధనలు సత్ఫలితాలనిస్తాయి. పారిశ్రామికరంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. 13,14 తేదీల్లో పనుల్లో ఆటంకాలు. ఆదాయం తగ్గుతుంది. ఇంటాబయటా సమస్యలు ఎదుర్కొంటారు. శ్రీవేంకటేశ్వరస్వామిని పూజించండి.
తుల... (చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. కాంట్రాక్టులు పొందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో తగిన లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు విధులు సమర్థవంతంగా సాగుతాయి. రాజకీయవర్గాల వారు పదవులు పొందుతారు. కళాకారులకు వ్యూహాలు ఫలిస్తాయి. అందరిలోను గుర్తింపు. విద్యార్థులకు పరిశోధనలు ఫలిస్తాయి. 14,15 తేదీల్లో ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు. శివాష్టకం పఠించండి.
వృశ్చికం... (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. చిరకాల కోరిక నెరవేరుతుంది. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. జీవిత భాగస్వామి నుంచి ఆస్తిలాభం. కొత్త ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార విస్తరణ యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఊహించని విధంగా సన్మానాలు జరుగుతాయి. కళాకారులకు అరుదైన పురస్కారాలు అందుతాయి. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. విద్యార్థులు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. 15,16 తేదీల్లో పనుల్లో ఆటంకాలు. బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబసమస్యలు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు... (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ఆర్థిక పరిస్థితి కాస్త నిరాశ కలిగిస్తుంది. పనుల్లో స్వల్ప ఆటంకాలు. వివాదాల పరిష్కారానికి చొరవ చూపుతారు. మీ ప్రతిభను చాటుకునేందుకు తగిన సమయం. దూరపు బంధువులను కలుసుకుని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. సహనంతో ముందుకు సాగి వివాదాలు పరిష్కరించుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు కొంత ఊపందుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది. రాజకీయవర్గాల అంచనాలు నిజమవుతాయి. సన్మానయోగం. కళాకారులకు కొత్త అవకాశాలు దగ్గరకు వస్తాయి. పారిశ్రామికవేత్తలు ఇంతకాలం ఎదుర్కొన్న సమస్య పరిష్కరించుకుంటారు. 14,15 తేదీల్లో ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
మకరం... (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)
ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన సమాచారం అందుకుంటారు. చిరకాల ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు ఉంటాయి. పదోన్నతి అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు జరుపుతారు. కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయవర్గాలవారికి నూతన పదవీయోగం. కళారంగం వారికి కొత్త్త అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. 18,19 తేదీల్లో బంధుగణం నుంచి విమర్శలు. ఆదాయానికి మించి ఖర్చులు. కష్టించినా ఫలితం కనిపించదు. అంగారక స్తోత్రం పఠించండి.
కుంభం... (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
చేపట్టిన కార్యక్రమాలు సజావుగానే సాగుతాయి. ఆర్థికంగా బలం చేకూరుతుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. ప్రత్యర్థులపై పట్టు సాధిస్తారు. భార్యాభర్తలు అవగాహనతో ఒక నిర్ణయానికి వస్తారు. వ్యాపారాలలో మరింత లాభాలు దక్కుతాయి. విస్తరణ యత్నాలు సాగిస్తారు. ఉద్యోగులకు సంతోషం కలిగించే సమాచారం అందుతుంది. పారిశ్రామికవర్గాలకు కీలక సమాచారం రావచ్చు. రాజకీయవర్గాలకు కొత్త పదవుల కోసం యత్నిస్తారు. కొంతవరకూ ఫలప్రదమవుతారు. కళాకారులు అంచనాలు నిజం చేసుకుంటారు. విద్యార్థులకు సాంకేతిక విద్యలలో ప్రవేశంపొందుతారు. 16,17 తేదీల్లో ఒక సమాచారం గందరగోళం కలిగిస్తుంది. వ్యయప్రయాసలు తప్పవు. కార్యక్రమాలలో అవరోధాలు. శ్రీకృష్ణాష్టకం పఠించండి.
మీనం... (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి).
ఆదాయం మరింతగా పెరుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. దూరపు బంధువులను కలుసుకుని కుటుంబ విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు పదవులు దక్కే అవకాశం. విద్యార్థులకు సాంకేతిక విద్యాకోర్సుల్లో అవకాశాలు. 17,18 తేదీల్లో ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు. బంధువులతో అకారణ వైరం. అనారోగ్యం. శ్రీనృసింహస్తోత్రాలు పఠించండి.
––––––––––––––––––––––––––––
