horoscope : ఈ వారం మీ రాశి ఫలాలు
రాశిఫలాలు... 20.07.25 నుంచి 26.07.25 వరకు

పండగలు – పర్వదినాలు
–––––––––––––––––––––-----------
20, ఆదివారం,పుష్యమి కార్తె
21, సోమవారం, మతత్రయ ఏకాదశి
23, బుధవారం, మాస శివరాత్రి
––––––––––––––––––––––––––––
మేషం... (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. అందరిలోనూ పరపతి పెరుగుతుంది. సన్నిహితులనుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ఆస్తి విషయాలలో బంధువులతో తగాదాలు పరిష్కారం. ఆలయాలు సందర్శిస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహకరిస్తారు.రావలసిన సొమ్ము అంది ఉత్సాహంగా సాగుతారు. ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా సొమ్ము సమకూరుతుంది. రుణదాతలు ఒత్తిడులు తగ్గిస్తారు. వివాహాది వేడుకలు నిర్వహిస్తారు. కొన్ని వివాదాల పరిష్కారంలో స్వయంగా చొరవ చూపుతారు. సోదరులు, సోదరీలతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం మరింత మెరుగుపడి ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగులు విధి నిర్వహణలో సేవలకు గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు ఆశించిన విధంగా పెట్టుబడులు అందుతాయి. విస్తరణ యత్నాలు కలసివస్తాయి. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు సన్మానాలు, సత్కారాలతో బిజీగా గడుపుతారు. కళాకారులు ఒక అవకాశం అప్రయత్నంగా దగ్గరకు వస్తుంది. 20,21 తేదీల్లో పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొంటారు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. విష్ణుధ్యానం చేయండి.
వృషభం... (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, వృగశిర 1,2 పాదాలు)
సన్నిహితులు, స్నేహితులతో వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. అరుదైన ఆహ్వానాలు రాగలవు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. ఆలయాలు సందర్శిస్తారు. కొంత సొమ్ము సకాలంలో అందుతుంది. భూవివాదాల పరిష్కారం ద్వారా లబ్ది పొందుతారు. రుణభారాలు తొలగుతాయి. కుటుంబం అందరిలోనూ మీ సత్తా చాటుకుంటారు. సంతానరీత్యా మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వేడుకుల నిర్వహణపై దృష్టి సారిస్తారు. పెద్దల సలహాల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం కొంత నలత చేసినా ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు విస్తరణయత్నాలు అనుకున్న విధంగా సాగుతాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలు పదోన్నతి అవకాశాలు. రాజకీయవర్గాలకు అనుకోని సన్మానాలు జరుగుతాయి. పదవులు ఊరిస్తాయి. కళాకారులు, పరిశోధకులకు అవకాశాలు దగ్గరకు వచ్చి ఉత్సాహాన్నిస్తాయి. 21,22 తేదీల్లో పనులలో ప్రతింబంధకాలు. సోదరులతో వివాదాలు మరింత చికాకు కలిగించవచ్చు. ఆలోచనలు అంతగా అనుకూలించవు. గురుదత్త స్తోత్రాలు పఠించండి.
మిథునం... (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు).
ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. శ్రమ పడ్డా ఆశించిన ఫలితం కనిపిస్తుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ ఆశయాల సాధనలో ఆప్తులు సహకరిస్తారు. భూములు, భవనాలు కొంటారు. దేవాలయాల సందర్శనం. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. అలాగే, రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. పొదుపు ద్వారా ఖర్చులు నియంత్రించుకుంటారు. మొత్తం మీద డబ్బుకు లోటు లేకుండా గడుస్తుంది. కుటుంబం..పెద్దల ఆశీస్సులు, అభిమానం పొందుతారు. మొదటి సంతానం ఉద్యోగ, వివాహయత్నాలు సానుకూలం. సోదరులతో విభేదాలు తొలగుతాయి. మీరు ఊహించిన విధంగానే కొన్ని సమస్యలు తీరతాయి. ఆరోగ్యం కొద్దిగా నలత చేసినా ఉపశమనం పొందుతారు. ఉద్యోగులు లక్ష్యాలు చేరుకుంటారు.పదోన్నతులు లభించే సమయం. వ్యాపారాలు వ్యూహాత్మకంగా ముందుకు సాగి లాభాల బాటలో పయనిస్తారు.రాజకీయ, పారిశ్రామికవేత్తలకు విజయవంతంగా గడుస్తుంది. మంచి గుర్తింపు పొందుతారు. 23,24 తేదీల్లో దూరప్రయాణాలు. శ్రమాధిక్యం తప్పదు. పనులు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. శివాష్టకం పఠించండి.
కర్కాటకం... (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష).
పనుల్లో కొంత జాప్యం. ముఖ్య నిర్ణయాలు వాయిదావేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. సన్నిహితుల నుంచి విమర్శలు సైతం ఎదుర్కొంటారు. విద్యార్థులు కొంత నిరాశకు లోనవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత సొమ్ము అందినా అవసరాలు తీరవు. మరోవైపు రుణదాతల ఒత్తిడులు పెరుగుతాయి. ఆస్తుల క్రయవిక్రయాలలో అవాంతరాలు. కుటుంబ సమస్యలు కొన్ని వేధిస్తాయి. సోదరులు, సోదరీలతో అకారణంగా తగాదాలు. ఆస్తుల పంపకాల్లో ఆటంకాలు. సంతానపరంగా కొత్త సమస్యలు ఎదురుకావచ్చు. ఆరోగ్యం మరింత శ్రద్ధ వహించండి. తరచూ రుగ్మతలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకొడిగానే సాగుతాయి.పెట్టుబడుల్లో తొందరవద్దు. ఉద్యోగులు ఆకస్మిక బదిలీలు జరిగే అవకాశాలు. విధులు మరింత జాగ్రత్తగా నిర్వర్తించాలి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వ్యయప్రయాసలు. కళాకారులు, పరిశోధకులకు వకాశాలు చేజారి నిరాశ చెందుతారు. 21,22 తేదీల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. గణపతిని పూజించండి.
సింహం... (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
కార్యక్రమాలు మరింత వేగంగా సాగుతాయి. ఆప్తుల నుండి కీలక సమాచారం. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. దేవాలయ దర్శనాలు. నిరుద్యోగుల యత్నాలు కొలిక్కి వస్తాయి. కష్టానికి తగిన ఫలితం దక్కి ఉత్సాహంగా సాగుతారు. ఆలోచనలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తారు. సొమ్ము సమకూరినా అవసరాలకు సరిపడక రుణాలు చేస్తారు. ఆస్తుల క్రయవిక్రయాలు కూడా లాభించి సొమ్ము అందుకుంటారు. కుటుంబంలో మీపై అంతా ప్రేమాభిమానాలు చూపుతారు. బంధువులతో తగాదాలు పరిష్కరించుకుంటారు. కొన్ని వేడుకలు నిర్వహిస్తారు. ఆరోగ్యం కొంత మెరుగ్గా ఉంటుంది. అయినా వైద్యసేవలు తప్పవు. వ్యాపారాలలో .కొద్దిపాటి లాభాలు లభిస్తాయి. పెట్టుబడులలో జాప్యం. ఉద్యోగులు శ్రమపడాల్సిన సమయం. అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. కళాకారులు, శాస్త్రవేత్తలకు శ్రమ మరింత పెరుగుతుంది. 20,21 తేదీల్లో ప్రయాణాలు చివరిక్షణంలో రద్దు చేసుకుంటారు. మిత్రులతో విభేదాలు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
కన్య... (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
సన్నిహితులు మరింత దగ్గరవుతారు. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆలోచనలు కలసివస్తాయి. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి. వాహనాలు, ఇల్లు కొనుగోలు చేస్తారు. డబ్బుకు కొదవ లేకుండా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. అప్రయత్నంగా సొమ్ము సమకూరుతుంది. ఇతరుల నుంచి రావలసిన మొత్తాలు కూడా అందే అవకాశాలు. మీ ప్రేమాభిమానాలతో కుటుంబసభ్యులు పరవశించిపోతారు. సోదరీలతో సఖ్యత నెలకొంటుంది. వివాహాది వేడుకలు నిర్వహిస్తారు. కొంత నలత చేసినా తక్షణ ఉపశమనం లభిస్తుంది. వ్యాపారులు పెట్టుబడులకు తగిన లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో అనుకోని ఇంక్రిమెంట్లు లభిస్తాయి. కళాకారులకు మరిన్ని అవకాశాలు రావచ్చు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. 25,26 తేదీల్లో వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఆదిత్య హృదయం పఠించండి.
తుల... (చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. సాహిత్యం, కళల పట్ల ఆసక్తి చూపుతారు. ఆలోచనలు అమలుచేసి ముందుకు సాగుతారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వాహనాలు,ఆభరణాలు కొంటారు. చిన్ననాటి స్నేహితులు తారసపడి ఉపయుక్తమైన సమాచారం అందిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి. ఆస్తులు, షేర్ల క్రయవిక్రయాలు కూడా లాభించి సొమ్ము అందుకుంటారు. పెద్దల సలహాల స్వీకరించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబసభ్యుల ప్రేమ పంచుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. కొత్త పెట్టుబడులతో ఉత్సాగంగా అడుగువేస్తారు. ఉద్యోగాలలో మరింత వెసులుబాట్లు కలుగుతాయి. కొన్ని చికాకులు తొలగుతాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు మరింత అనుకూలం. 23,24 తేదీల్లో ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అవకాశాలు చేజారతాయి. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.
వృశ్చికం... (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
అనుకున్న వ్యవహారాలు కష్టసాధ్యమైనా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. మిత్రులు, సన్నిహితులతో నెలకొన్న విభేదాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. పరిస్థితులను అనుకూలంగా మలచుకుని ముందుకు సాగుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. డబ్బుకు ఇబ్బంది పడ్డా అవసరాలు తీరతాయి. రుణదాతల నుంచి ఒత్తిడులు తగ్గుతాయి. మీ మాటంటే కుటుంబంలో ఎదురుండదు. అయితే, తొందరపాటు నిర్ణయాలు కొన్ని ఇబ్బందులు కలిగించవచ్చు. వ్యాపారాలలో ప్రస్తుత పరిస్థితులు అనుకూలించక స్వల్ప లాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగాలలో బాధ్యతలు నెరవేర్చడంలో విజయం సాధిస్తారు. ఉన్నతాధికారులు ప్రశంసిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు అంచనాలు నిజమవుతాయి. 25,26 తేదీల్లో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం తప్పదు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
ధనుస్సు... (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
కొత్త వ్యవహారాలు చేపట్టి సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఎదుటవారి సమస్యలు సైతం పరిష్కరిస్తారు. మీ నిర్ణయాలు మిత్రులు స్వాగతిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు యత్నాలలో పురోగతి. విద్యార్థులకు కాస్త ఊరట లభిస్తుంది. సొమ్ములు అంది అవసరాలు తీరతాయి. కుటుంబంలో అందరితోనూ ప్రేమగా మసలుకుంటారు. మీ ఆప్యాయతకు బంధువులు పులకిస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు పొంది ఊరట చెందుతారు. కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు క్రమేపీ తొలగుతాయి. విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు నూతనోత్సాహం. 20,21 తేదీల్లో పనుల్లో అవరోధాలు. కంటికి సంబంధించిన రుగ్మతలు. రాబడి తగ్గి అప్పులు చేస్తారు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
మకరం... (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)
కొన్ని పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. సన్నిహితులతో స్వల్ప వివాదాలు. భూములు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల సలహాలు పాటిస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగావకాశాలు దక్కుతాయి.ఇంటి నిర్మాణాలపై ప్రణాళిక రూపొందిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. రావలసిన డబ్బు అందుతుంది. ఆస్తులు, షేర్ల విక్రయాలు ద్వారా కూడా లాభం పొందుతారు. సోదరుల ద్వారా కొంత సొమ్ము అందుతుంది. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. ఒకరి ఆరోగ్యం మెరుగుపడి ఊరట చెందుతారు. సంతాన రీత్యా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వివాహ వేడుకలలో పాలుపంచుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో ముందడుగు వేస్తారు. అనుకూల మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. కళాకారులకు మరిన్ని అవకాశాలు దక్కుతాయి. 23,24 తేదీల్లో ఆర్థిక పరిస్థితి కొంత ఆందోళన కలిగిస్తుంది. రుణవత్తిడులు. దూరప్రయాణాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
కుంభం... (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీ శ్రేయోభిలాషులు సలహాలను పాటిస్తారు. సంఘంలో గౌరవమర్యాలుపెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఆలయాలు సందర్శిస్తారు.ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఆస్తుల క్రయవిక్రయాలు కూడా లాభించి డబ్బు అందుతుంది. కుటుంబసభ్యులతో సంతోషకరంగా గడుపుతారు. వివాహ వేడుకల నిర్వహణలో నిమగ్నమవుతారు. మీ ఆశయాలు నెరవేరతాయి. భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి. కొత్త వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టేందుకు మంచిది. నడుస్తున్న వ్యాపారాలను మరింత తీర్చిదిద్దుతారు. ఉద్యోగులకు ఊహించని రీతిలో పదోన్నతులు లభిస్తాయి. విధి నిర్వహణలో ఉత్సాహంగా గడుపుతారు. రాజకీయ, పారిశ్రామికవేత్తల యత్నాలు ఫలిస్తాయి. కళాకారులకు మరిన్ని అవకాశాలు దక్కుతాయి. 25,26 తేదీల్లో ఇంటాబయటా సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక అశాంతి. కనకధారా స్తోత్రాలు పఠించండి.
మీనం... (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి).
ప్రముఖులతో పరిచయాలు. ముఖ్య సమావేశాల్లో పాల్గొంటారు. పెండింగ్‌లో ఉన్న కార్యక్రమాలు సైతం పూర్తి చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. రావలసిన సొమ్ము అందుతుంది. డబ్బులకు లోటులేకుండా గడుస్తుంది. షేర్ల క్రయవిక్రయాలు కూడా లాభించి సొమ్ము అందుకుంటారు. తండ్రి తరఫు వారితో వివాదాలు తీరతాయి. ఆస్తుల పంపకాలలో చిక్కులు తొలగుతాయి. సంతానపరంగా మరిన్ని శుభవార్తలు వింటారు. ద్వేషించిన బంధువులు కూడా మీపై ప్రేమ చూపుతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం, పెట్టుబడులకు ఢోకా లేదు. ఉద్యోగాలలో .ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పైస్థాయి వారి ప్రశంసలు పొందుతారు. పారిశ్రామికవేత్తలు∙పురస్కారాలు అందుకుంటారు. కళాకారులు, పరిశోధకులకు నూతనోత్సాహం. 24,25 తేదీల్లో ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. బంధుమిత్రులతో వివాదాలు. మంచికి వెళ్లినా చెడుగా మారుతుంది. హనుమాన్ ఛాలీసా పఠించండి.
–––––––––––––––––
