This week Horoscope : ఈ వారం మీ రాశి ఫలాలు
రాశిఫలాలు...31.08.25 నుండి 06.09.25 వరకు

పండగలు – పర్వదినాలు ...
––––––––––––––––––––––
31, ఆదివారం, దూర్వాష్టమి.
03, బుధవారం, పరివర్తనైకాదశి.
06, శనివారం, శ్రీఅనంతపద్మనాభ వ్రతం.
–––––––––––––––––––––––––––––––––
మేషం... (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
కొత్త విషయాలు తెలిసి ఆశ్చర్యపడతారు. ఆర్థికంగా కొన్ని వెసులుబాట్లు కలిగి అవసరాలు తీరతాయి. మీ ఆలోచనలు అమలు చేయడంలో అవాంతరాలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం రాగలదు. కొన్ని సమస్యలు లేదా వివాదాలను పరిష్కరించుకోవడంలో చొరవ తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో అత్యంత ఆప్తులైన వారితో చర్చిస్తారు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. రుణభారాల నుండి విముక్తి లభిస్తుంది. కుటుంబసభ్యులు మరింత ప్రేమానురాగాలు చూపుతారు. ఆరోగ్య నియమాలు పాటిస్తూ, దైనందిన కార్యక్రమాలలో మార్పులు చేసుకుంటే మంచిది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు పెట్టుబడుల సమీకరణలో కొత్త విధానాలు అవలంభిస్తారు. ఉద్యోగులు విధుల్లో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. రాజకీయవేత్తలు, వ్యవసాయదారులు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. 05,06 తేదీల్లో ముఖ్యమైన పనుల్లో అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు, ఒత్తిడులు. ఆంజనేయ దండకం పఠనం ఉత్తమం.
వృషభం... (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, వృగశిర 1,2 పాదాలు)
చేపట్టిన కార్యక్రమాలలో ఎటువంటి అవాంతరాలు లేకుండా పూర్తి చేస్తారు. ఆర్థికంగా కొంతకాలంగా పడుతున్న ఇబ్బందులు తీరి ఉపశమనం లభిస్తుంది. స్థిరాస్తుల కొనుగోలులో ఒప్పందాలు చేసుకుంటారు. అధునాత వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి అందిన పిలుపు మీకు సంతోషదాయకంగా ఉంటుంది. కొత్త కాంట్రాక్టులను ఎట్టకేలకు దక్కించుకుంటారు. ఎంతటి వారినైనా అత్యంత నేర్పుగా ఆకట్టుకుంటారు. పరిచయస్తులు పెరిగి మీకు చేయూతగా నిలుస్తారు. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు కొత్త భాగస్వాములతో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఉద్యోగులు విధుల్లో కొన్ని ప్రతిబంధకాలు అధిగమిస్తారు. క్రీడాకారులు, శాస్త్రవేత్తల కృషి ఫలిస్తుంది. 31,01 తేదీల్లో అనారోగ్యం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. పనులు కొన్ని మధ్యలో విరమిస్తారు. నవగ్రహ ధ్యానం చేయండి.
మిథునం... (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు).
కొన్ని వివాదాలను అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. కార్యక్రమాలలో అవాంతరాలు తొలగి సమయానికి పూర్తి చేస్తారు. విచిత్ర సంఘటనలు కొన్ని ఆశ్చర్యపరుస్తాయి. ఆలోచనలను కొలిక్కి తెస్తారు. ఇతరుల ప్రమేయం లేకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యతిరేకులకు మీపై ఉన్న అనుమానాలు నివృత్తి కాగలవు. స్థిరాస్తులు కొనుగోలుపై సోదరులతో ఒక అంగీకారానికి వస్తారు. వాహనసౌఖ్యం. ఆదాయం మీ అంచనాలకు తగినట్లుగా ఉంటుంది. ఎవరినీ ప్రాధేయపడకుండా సర్దుబాటు చేసుకుంటారు. బంధువులు, పెద్దలు మీపై మరింత ప్రేమ చూపుతారు. వేడుకల నిర్వహణలో హడావిడాగా గడుపుతారు. వ్యాపారులు, వాణిజ్యవేత్తలు సంస్థల అభివృద్ధిపై దృష్టి పెడతారు. ఈ దిశగా ఆలోచనలు సాగిస్తారు. ఉద్యోగులు విధి నిర్వహణలో భారం పెరిగిన ప్రశాంతంగా పూర్తి చేస్తారు. కళాకారులు, క్రీడాకారులు ఇతరులకు స్ఫూర్తిదాతలుగా నిలుస్తారు. వీరు కొన్ని త్యాగాలకు సిద్ధపడతారు. 03,04 తేదీల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువర్గంతో విభేదాలు. అనారోగ్యం, వైద్యసేవలు. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం... (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష).
పట్టుదలతో మీరు తలపెట్టిన కార్యాలు పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగాలు దక్కవచ్చు. ధార్మికవేత్తలతో సమావేశమై మీ సందేహాలను నివత్తి చేసుకుంటారు. మీ మాట అందరిలోనూ చెల్లుబాటు కాగలదు. కొత్త వ్యక్తులతో పరిచయం సంతోషం కలిగిస్తుంది. సొమ్ముకు లోటు లేకుండా సమయానికి అందుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొని వారితో ఉల్లాసంగా గడుపుతారు. పెద్దల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరంగా చికాకులు తొలగుతాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు సంస్థల విస్తృతికి చర్యలు చేపడతారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల సూచనలతో విధులలో మార్పులు చేసుకుంటారు. వ్యవసాయదారులు, క్రీడాకారుల ఆశలు ఫలిస్తాయి. 04,05 తేదీల్లో శ్రమ తప్పదు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. విష్ణుధ్యానం చేయండి.
సింహం... (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
కొత్త కార్యక్రమాలను చేపట్టి మీరు నిర్దేశించుకున్న సమయానికే పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం రాగలదు. పలుకుబడి కలిగిన వారు మీకు ఇతోధికంగా సహకరిస్తారు. ఆదాయానికి పడ్డ ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. వాహనాలు, ఖరీదైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణాలపై మీ ఆలోచనలు కలసివస్తాయి. పట్టుదలతో ముందుకు సాగి సమస్యలను అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు చిరకాల కోరిక నెరవేరుతుంది. కొద్దిపాటి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. మీ బాధ్యతలను వేరేవారికి అప్పగించవద్దు, మీరే స్వయంగా పూర్తి చేయడం ఉత్తమం. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు మరింత పుంజుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు పైస్థాయి వారు ఊహించని సాయం అందిస్తారు. సాంకేతిక నిపుణులు, క్రీడాకారులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. వీరి ప్రతిభ వెలుగుచూస్తుంది. 31,01 తేదీల్లో బంధువులతో వైరం. ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం. గణేశాష్టకం పఠించండి.
కన్య... (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
ముఖ్య వ్యవహారాలు కొన్ని వేగవంతంగా పూర్తి చేస్తారు. ప్రయాణాలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు. మీ ఆలోచనలు ఇతరులకు ఎక్కువగా ఉపయోగపడతాయి. నిరుద్యోగులకు ఎట్టకేలకు ఉద్యోగం లభించే అవకాశం. మిత్రులను కలుసుకుని కష్టసుఖాలను విచారిస్తారు. ఇళ్లు, ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. ఆధ్యాత్మికవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమవుతారు. ఆదాయానికి ఇంతకాలం పడిన ఇబ్బందులు తీరతాయి. కుటుంబసభ్యుల ఆత్మీయతానుగారాలు పొందుతారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తీరతాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు బ్యాంకు రుణాలు, ఇతరత్రా పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులు పనివిధానంలో మార్పులు చేసుకుని ముందుకు సాగుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. 02,03 తేదీల్లో కుటుంబసభ్యులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆస్తి వివాదాలు. శివారాధన మంచిది.
తుల... (చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
అనుకున్న కార్యక్రమాలు ఎంత ప్రయత్నించినా ముందుకు సాగవు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుంటే మంచిది, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్నేహితులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. తగాదాలు. కొన్ని సమస్యలు ఎదురై సహనానికి పరీక్షగా నిలుస్తాయి. పెద్దలు చెప్పిన విషయాలు కొన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. దేవాలయాల సందర్శనంతో మనశ్శాంతి చేకూరుతుంది. ఎదురుచూస్తున్న సొమ్ము అందక ఖర్చులకు సైతం ఇబ్బందిపడాల్సిన సమయం. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు కొన్ని దూరం కావచ్చు. అయినా మొక్కవోని దీక్షతో ముందడుగు వేయండి. అనుకోని ప్రయాణాలు ఉండవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అవసరం. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు వ్యాపారాల ఉన్నతికి ఎటూ నిర్ణయాలు తీసుకోలేరు. ఉద్యోగులు విధుల్లో ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్తపడాలి. రాజకీయవేత్తలు, కళాకారులకు కొత్త సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. 01,02 తేదీల్లో శ్రమ ఫలిస్తుంది. నూతన విషయాలు లె లుసుకుంటారు. ఆర్థిక ప్రగతి ఉంటుంది. ధన,వస్తులాభాలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
వృశ్చికం... (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
క్రమేపీ పరిస్థితులు అనుకూలించడం విశేషం. మీ క్రమశిక్షణ, పనితీరును బంధువులు మెచ్చుకునేలా ఉంటారు. కుటుంబంలో కొన్ని శుభకార్యాలకు కార్యాచరణ రూపొందిస్తారు. ఆస్తులు విషయంలో నెలకొన్న సమస్యలు, స్తబ్ధత తొలగుతాయి. ఖరీదైన వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు విద్యావకాశాలు అనూహ్యంగా దక్కవచ్చు. ఆత్మీయుల నుంచి శుభవర్తమనాలు అందుతాయి. మీ శ్రమ ఇన్నాళ్లకు ఫలిస్తుంది. కొంత సొమ్ము ఆకస్మికంగా అందుకుంటారు. మీ అవసరాలకు లోటులేని విధంగా గడుస్తుంది. ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు స్వీయ అనుభవాలతో ముందడుగు వేస్తారు. 04,05 తేదీల్లో పనుల్లో ఆటంకాలు, జాప్యం. అనారోగ్యం. దూరప్రయాణాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
ధనుస్సు... (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
మీ ఊహకు అందని విషయాలు తెలుస్తాయి. కార్యక్రమాలలో ఎటువంటి అవాంతరాలైనా అధిగమిస్తారు. మీలోని ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇంతకాలం ఎదుర్కొన్న ఒక ప్రధాన సమస్యను పరిష్కరించుకుంటారు. కీలక సమావేశాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు మీలో కొత్త ఆశలు చిగురింపజేస్తాయి. అనుకున్న సమయానికి అవసరాలకు సొమ్ము అందుకుంటారు. మీపై బంధువులు మరింత అనురాగం, ఆదరణ చూపుతారు. వివాహ యత్నాలు సాఫీగా పూర్తి చేస్తారు. విద్యార్థుల కృషి , పట్టుదల ఫలిస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థల వికేంద్రీకరణపై దృష్టి సారిస్తారు. ఉద్యోగస్తులు విధుల్లో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు. క్రీడాకారులు, కళాకారులకు కొన్ని అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. 05,06 తేదీల్లో పనుల్లో కొంత జాప్యం. రుణాలు చేస్తారు. మిత్రులతో విభేదాలు నెలకొంటాయి. నరసింహస్వామిని ధ్యానిస్తే శుభదాయకంగా ఉంటుంది.
మకరం... (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)
ముఖ్యమైన కార్యక్రమాలకు ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేస్తారు. సన్నిహితులు మీ ద్వారా ఉపకారం పొందుతారు. ఆదాయానికి ఇబ్బంది లేకుండా ఏదోవిధంగా డబ్బు సమకూరుతుంది. కుటుంబసభ్యులు మరింత వినయవిధేయతలు చూపుతారు. ఆస్తుల వ్యవహారాలలో జరిగిన ఒప్పందాలలో సవరణలు చేస్తారు. గృహం కొనుగోలుపై తుది నిర్ణయం తీసుకుని ముందడుగు వేస్తారు. మీపై కొందరు మోపిన అభాండాల నుండి బయటపడతారు. ఇంట్లో వేడుకల నిర్వహణలో హడావిడిగా గడుపుతారు. ఆరోగ్యం కొంత కుదుటపడి ఉపశమనం లభిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు పెట్టుబడులు సాధన దిశగా అడుగులు వేస్తారు. ఆదిశగా విజయం సాధిస్తారు. ఉద్యోగులపై ఎటువంటి బాధ్యత మోపినా తేలిగ్గా నెరవేరుస్తారు. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులు కోరుకున్న విధంగా అవకాశాలు సాధిస్తారు. 03,04 తేదీల్లో ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. నాగప్రతిష్ఠ చేసిన ఆలయంలో ఆవుపాలతో అభిషేకం చేయండి.
కుంభం... (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
అనుకున్న వ్యవహారాలు కొంత కష్టసాధ్యమైనా పూర్తి చేస్తారు. రాబడి విషయంలో నెలకొన్న ఇబ్బందులు తీరి ఊరట లభిస్తుంది. మీ ఖ్యాతి మరింత పెరిగి విశేష గుర్తింపు లభిస్తుంది. ఆలోచనలు అమలులో ఆటంకాలు అధిగమిస్తారు. మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కుటుంబసభ్యులు సహకరిస్తారు. పరిచయాలు విస్తృతం కాగలవు. ప్రముఖుల నుండి ఉపయోగకరమైన సమాచారం రావచ్చు. స్థిరాస్తులు సమకూర్చుకునే పనిలో నిమగ్నమవుతారు. వ్యతిరేక భావాలు కలిగిన వారు సైతం మీకు చేయూతనందిస్తారు. ఆరోగ్యంపై మాత్రం ప్రధానంగా దృష్టి పెట్టండి. నిర్లక్ష్యం వద్దు. కుటుంబసభ్యులకు. ఆత్మీయులకు ప్రేమానురాగాలు పంచుతారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు లాభాలపై పెట్టుకున్న ఆశలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో మీరు ఆశించిన మార్పులు జరిగే అవకాశం. రాజకీయవేత్తలు, క్రీడాకారులు నైపుణ్యంతో ముందడుగు వేసి విజయాలు సాధిస్తారు. 02,03 తేదీల్లో కుటుంబ, ఆరోగ్య సమస్యలు. మిత్రులతో అకారణంగా తగాదాలు. చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. దుర్గాదేవిని స్మరించండి.
మీనం... (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి).
ముఖ్యకార్యక్రమాలు పూర్తి కానిచ్చే వరకూ విశ్రాంతి తీసుకోరు. మీ పట్టుదలను చూసి మిత్రులు ఆశ్చర్యపడతారు. మీరే చేసే ప్రతిపాదనలు కుటుంబసభ్యులకు ఆమోదయోగ్యంగా ఉంటాయి. ఆదాయం మీ అవసరాలకు సరిపడే విధంగా ఉంటుంది. కొన్ని తీర్థయాత్రలు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభ సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఎదురుచూసే అవకాశాలు సొంతం చేసుకుంటారు. వాహనాలు, విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. శుభకార్యాలకు తగిన అంచనాలు సిద్ధం చేస్తారు. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందిపడే సూచనలు. వ్యాపార, వాణిజ్యవేత్తలు విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేసి విజయం సాధిస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణ సులువుగా సాగిపోతుంది. వ్యవసాయదారులు, శాస్త్రవేత్తలకు అన్ని వి«ధాలా అనుకూల సమయం. 05,06 తేదీల్లో ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆంజనేయ దండకం పఠించండి.
––––––––––––––––––––----------------------
