ఒకే సారి 20 పాఠశాలలకు ఫేక్‌ ఈమెయిల్స్‌ పంపిన దుండగులు

ఒకే సారి 20 పాఠశాలల్లో బాంబులు ఉన్నాయని బెదిస్తూ ఈమెయిల్స్‌ రావడంతో రాజధాని ఢిల్లీ నగరం ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యింది. గురువారం ఉదయం 7గంటల నుంచి 8 గంటల వరకూ వరుస ఈమెయిల్స్‌ రావడంతో పోలీసులు భారీ భద్రతా చర్యల చేపట్టారు. ముందుగా బాంబులు అమర్చారని ఈమెయిల్స్‌ వచ్చిన పాఠశాలలన్నింటిలో విధ్యార్థులను అక్కడ నుంచి తరలించారు. తూర్పు, దక్షిణ ఢిల్లీలతో పాటు మధ్య ఢిల్లీలో ఉన్నప్రముఖ పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని ఈ బాంబు బెదిరింపు ఈమెయిల్స్‌ పంపినట్లు తెలుస్తోంది. పాఠశాల ప్రాంగణంలో పేలుడు పదార్ధాలు అమర్చబడి ఉన్నాయని హెచ్చరిస్తూ ఈమెయిళ్లు వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. పాఠశాలలకు ఈమెయిళ్ళు అందిన వెంటనే ఆయా పాఠశలల యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తక్షణం బాంబ్‌ డిస్పోజబుల్‌ టీమ్‌ లు డాగ్‌ స్క్వాడ్లతో వచ్చి బాంబు బెదిరింపులు వచ్చిన అన్ని పాఠశాలల్లో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముందు జాగ్రత్త చర్యలుగా పాఠశాల సిబ్బందిని విద్యార్థులను తరలించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. బాంబ్‌ స్క్వాడ్‌ పాఠశాలలను ఆమూలాగ్రం పరిశీలించిన తరువాత ఎక్కడా ఎటువంటి పేలుడు పదార్ధాలు లభ్యం కాలేదని వెల్లడించారు. ఈమెయిల్స్‌ అన్నింటినీ ఫేక్‌ మెయిల్స్‌ గా గుర్తించారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు చాలా సీరియస్‌ గా తీసుకున్నారు. సైబర్‌ బృందాలు రంగంలోకి దిగి ఈమెయిల్స్‌ ఎక్కడ నుంచి వచ్చాయి, వాటి ఐపీ అడ్రస్‌ లను గుర్తించే పనిలో పడ్డారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story