Education:ఇంటర్మీడియట్ లేదా హై స్కూల్ తర్వాత విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి ఒక కీలకమైన దశను ఎదుర్కొంటారు. ఇంజనీరింగ్, మెడికల్, ఆర్ట్స్, కామర్స్, సివిల్స్, డిఫెన్స్,డిజైన్, జర్నలిజం ఈ రంగాలన్నింటిలో ఏది ఎంచుకోవాలో తెలియక అయోమయానికి లోనవుతారు. ఇలాంటి సమయంలో సరైన వృత్తి మార్గదర్శనం విద్యార్థికి ఎంతో అవసరం.

వృత్తి మార్గదర్శనం అంటే కేవలం ఒక సలహా కాదు, అది విద్యార్థి జీవితాన్ని మార్చుతుంది. ఒక విద్యార్థి యొక్క ఆసక్తులు,నైపుణ్యాలు, విలువలు,వ్యక్తిత్వ లక్షణాలు,మార్కులు,కుటుంబ పరిస్థితులు మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకొని సరైన రంగాన్ని సూచించడమే మార్గదర్శకుడు పని.

ఈ దిశగా స్కూళ్లు,కాలేజీలు ప్రత్యేక సెమినార్లు వర్క్ షాప్ లు నిర్వహించాలి ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ లేదా పాత విద్యార్థులను తీసుకువచ్చి వారి అనుభవాలను షేర్ చేయించాలి. ఇందువల్ల విద్యార్థులు స్పష్టత పొందగలుగుతారు.

తల్లిదండ్రులు కూడా తమ ఆశలతో పిల్లలపై ఒత్తిడి పెట్టకుండా వారి స్వేచ్ఛను గౌరవించాలి. తాను ఇష్టపడే రంగంలోనే విద్యార్థి తన శక్తిని పూర్తిగా వినియోగించగలరు. సరైన మార్గదర్శనం అందిన విద్యార్థులు చదువులోనూ,ఉద్యోగంలోనూ అత్యుత్తమ స్థాయికి చేరుతారు.

ప్రతి విద్యార్థి ప్రత్యేకమైన వాడు అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం సరిపోతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని వ్యక్తిగత మార్గదర్శనం చేయాలి. ఇది దేశానికి విజేతలను తయారు చేస్తుంది.

Updated On
PolitEnt Media

PolitEnt Media

Next Story