Education:సమగ్ర అభివృద్ధికి విద్య ఒక సాధనం
విద్య ఒక సాధనం

Education:విద్య అనేది కేవలం పుస్తకాలకు పరిమితం కాదు ఇది మనిషిని అన్ని కోణాల్లో అభివృద్ధి పరిచే సాధనం. మానవ జీవితాన్ని విలువలతో నడిపించే మార్గదర్శకం.
సమగ్ర అభివృద్ధి అంటే శారీరక,మానసిక,సామాజిక,ఆర్థిక,నైతిక మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి. ఈ అన్ని కోణాలను విద్య ప్రభావితం చేస్తుంది. మంచి చదువు,ప్రవర్తన,సంస్కారం,నైతికత విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి.
విద్యార్థులు విద్య ద్వారా తమలో ప్రతిభను,నైపుణ్యాన్ని,భావ ప్రకటన శక్తిని,నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకుంటారు. ఇది వ్యక్తిగత స్థాయిలోనూ,సమాజ స్థాయిలోనూ వారు శక్తివంతంగా నిలబడేందుకు సహాయపడుతుంది.
ఇందుకు స్కూల్లు కాలేజీలు కేవలం పాఠ్యాంశాలకు కాకుండా సహా పాఠ్య కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. క్రీడలు,కళలు,ప్రజాసంభాషణలు,సమూహ చర్చలు వంటి విషయాలు విద్యార్థుల సామర్థ్యాన్ని విస్తరిస్తాయి.
పాఠశాలలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి వేదికలుగా మారాలి. తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు ఈ మార్పులో భాగస్వాములై విద్యార్థికి దిశా నిర్దేశం చేయాలి.
అలాంటప్పుడు విద్య మాత్రమే కాదు,అది ఒక దేశ అభివృద్ధికి పునాది అవుతుంది విద్య సాధ్యమవుతుంది. ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి.
