శనివారంతో ముగిసిన కౌన్సిలింగ్... మిగిలిన 598 సీట్లు

ఆంధ్రప్రదేశ్ ఐఐఐటీ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి భారీగా సీట్లు మిగిలిపోయాయి. ఏపీలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ శనివారంతో ముగిసింది. కౌన్సెలింగ్ అనంతరం నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కలిపి 598 సీట్లు మిగిలాయి. ఒక్కో ట్రిపుల్ఎటీలో 1,010 సీట్లు ఉండగా, నూజివీడులో 139, ఇడుపులపాయలో 132, శ్రీకాకుళంలో 144, ఒంగోలులో అత్యధికంగా 183 సీట్లు మిగలడం గమనార్హం. ఈ సీట్లను భర్తీ చేసేందుకు ఈ నెల 14 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కౌన్సెలింగ్ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా 15 రోజులు ఆలస్యం కావడం వల్ల చాలా మంది పాలిటెక్నిక్, ఇంటర్ కాలేజీల్లో చేరిపోయి ఉంటారని భావిస్తున్నారు. కాగా సీట్లు పొందిన వారికి ఈ నెల 14 నుండి తరగతుల ప్రారంభమవుతాయని రిజిస్ట్రార్ తెలిపారు.

Updated On 8 July 2025 8:55 AM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story