Line clear for sports school admissions in telangana

తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్‌ స్కూల్స్‌ కోసం ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. విద్యార్థులను చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచి.. క్రీడలలో శిక్షణ అందించేందుకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ క్రీడా పాఠశాలలను నిర్వహిస్తోంది. ఇందులో అడ్మిషన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు టైమ్ వచ్చింది. తెలంగాణ క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతి ప్రవేశానికి సంబంధించిన ప్రవేశాల ప్రక్రియ షురూ అయింది. 2025-26 సంవత్సరానికి సంబంధించి ఎంపిక ప్రక్రియ జరగనుంది.

సీట్ల వివరాలు

హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్‌ క్రీడా పాఠశాలల కోసం ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. హకీంపేట్ బాలురు-20 సీట్లు, బాలికలు-20 సీట్లు. కరీంనగర్ బాలురు-20 సీట్లు, బాలికలు-20 సీట్లు, ఆదిలాబాద్‌ బాలురు-20 సీట్లు, బాలికలు-20 సీట్లు ఉన్నాయి. అంటే మెుత్తం 120 సీట్లలో 60 బాలురకు, 60 బాలికలకు అన్నమాట.ఎంపిక ప్రక్రియ మూడు విధానాల్లో జరుగుతుందని గుర్తుంచుకోవాలి. 16-06-2025 నుంచి 19-06-2025 మధ్య మండల స్థాయి ఎంపిక జరుగుతుంది. 23-06-2025 నుంచి 26-06-2025 మధ్య జిల్లా స్థాయి సెలక్షన్ ఉంటుంది. 01-07-2025 నుంచి 05-07-2025 వరకు రాష్ట్ర స్థాయి ఎంపిక చేస్తారు. ఇందులో ఎంపికైన వారి మెరిట్ ఆధారంగా తీసుకుంటారు.ఫిజకల్ పరీక్షలు(27 మార్కులు)

30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్స్, స్టాండింగ్ బాడీ జంప్, 800 మీటర్ల రన్, 6x10 మీటర్ల షటిల్ రన్, మెడిసిన్ బాల్ త్రో, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, ఎత్తు, బరువు. ఈ పరీక్షలు చేస్తారు. ఇందులో ప్రతీదానికి 3 మార్కులు ఉంటాయి. మెుత్తం కలిపితే 27 మార్కులు అవుతాయి.

మెడికల్ పరీక్షలు : వయసు ధృవీకరణ, పోస్టర్, బోన్ అబ్ నార్మలిటీస్ పరీక్షలు చేస్తారు.

పుట్టిన తేదీలు : 01-09-2016 నుంచి 31-08-2017 మధ్య జన్మించి ఉండాలి. అంటే 8 నుంచి 9 సంవత్సరాల వయసు.

ముఖ్యమైన వివరాలు

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మొదలైంది. విద్యార్థులు www.tgss.telangana.gov.inలో వివరాలు నమోదు చేసుకోవచ్చు. పరీక్షలు నిర్వహించే ప్రదేశం, తేదీలు, ఇతర వివరాలకు సంబంధిత జిల్లా క్రీడా, యువజన శాఖ అధికారిని సంప్రదించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

Politent News Web3

Politent News Web3

Next Story