యూనివర్శిటీ స్నాతకోత్సంలో ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ వ్యాఖ్య

దేశానికి ఎంతో మంది మేధావులను, నాయకులను ఉస్మానియా యూనివర్శిటీ అందించిందని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ అన్నారు. మంగళవారం యాన ఉస్మానియో విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణన్‌ మాట్లాడుతూ డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ డిగ్రీ పట్టా ఇచ్చినందుకు ఆయన ఉస్మానియా యూనివర్శిటీ పాలక మండలికి ధన్యవాదాలు తెలియజేశారు. తల్లిదండ్రుల కృషి, గురువుల ప్రోద్బలంతో ఈ రోజు ఈ స్ధానంలో ఉన్ననని చెప్పారు. ఉస్మానియో యూనివర్శిటీ అలుమ్ని ఎంతో గొప్పదని, దేశంలో టాప్‌ టెన్‌ విశ్వవిద్యాలయాల్లో ఉస్మానియా యూనివర్శిటీ ఒకటని కొనియాడారు. ఉస్మానియా యూనివర్శిటీలో చదువుకున్న వ్యక్తి నోబుల్‌ బహుమతి సాధించాలని నారాయణన్‌ ఆకాక్షించారు. ఈ ఏడాది వంద ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ప్రపంచమంతా ఇస్రో వైపు చూస్తోందని నారాయణన్‌ తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ సారధ్యంలో భారత అంతరీక్ష శక్తిని ప్రంపచ దేశాలకు చాటి చెపుతున్నామన్నారు. త్వరలో అమెరికా కమ్యూనికేషన్‌ ఉపగ్రహ లాంఛర్‌ని ఇండియా నుంచి ప్రయోగించబోతున్నట్లు నారాయణన్‌ తెలిపారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story