Education: ఈ ఆధునిక కాలంలో విద్యార్థులు సాంకేతిక విజ్ఞానం లేకుండా నిలబడలేదు ప్రపంచం అంతా టెక్నాలజీ ఆధారంగా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో టెక్నికల్ స్కిల్స్ కి అధిక డిమాండ్ ఉంది. కోడింగ్,డేటా సైన్స్,ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్,సైబర్ సెక్యూరిటీ రంగాల్లో అవకాశాలు విస్తరిస్తున్నాయి.

ఇవన్నీ ప్రాథమిక స్థాయిలోనే కాక మౌలిక స్థాయిలోనూ విద్యార్థులకు నేర్పాలి. స్కూల్లు,కాలేజీలు వారి పాఠ్యాంశాల్లో టెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాజెక్ట్ వర్కులు,హ్యాండ్ ఆన్ ప్రాక్టికల్స్,డిజిటల్ ల్యాబ్స్ వంటి టెక్నికల్ జ్ఞానాన్ని పెంపొందిస్తాయి.

విద్యార్థులు డిజిటల్ వనరుల ద్వారా స్వయంగా నేర్చుకోవచ్చు. YouTube,Coursera,Udemy,Khan Academy వంటి వేదికలు ఉచితంగా మరియు తక్కువ ఖర్చుతో కోర్సులను అందిస్తున్నాయి. ఇది సామాన్య విద్యార్థికి అవకాశాన్ని తెచ్చిపెడుతుంది.

సాంకేతిక పరిజ్ఞానం ఉన్న విద్యార్థి సమస్యలను శాస్త్రీయంగా పరిష్కరించగలరు. తన దైనందిన జీవితానికే కాదు,సమాజ అభివృద్ధికి తోడ్పడగలడు.

అందువల్ల, టెక్నాలజీ పై ఆసక్తి కలిగించటం,ప్రోత్సహించడం మరియు అవకాశాలు కల్పించడంలో తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు,పాలకులు కీలక పాత్ర పోషించాలి.

Updated On
PolitEnt Media

PolitEnt Media

Next Story