కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యారంగంలో సమూల మార్పులు నెల్లూరు విఆర్ హైస్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేష్

రాబోయే రోజుల్లో ఎపి విద్యావ్యవస్థను దేశంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శపథం చేశారు. సోమవారం నెల్లూరు వీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ పునఃప్రారంభం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు సవాళ్ళు అంటే ఇష్టమని తెలిపారు. అందుకే 37 సంవత్సరాలుగు టీడీపీ గెలవని మంగళగిరి నియోజకవర్గాన్ని పోటీ చేయడానికి ఎంచుకుని మొదటి ప్రయత్నంలో ఓడిపోయానని, అయినా పట్టుదలతో పని చేసి క్రితం సంవత్సరం జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోనే 3వ అత్యథిక మెజార్టీతో గెలుపొందానని పేర్కొన్నారు. అదేవిధంగా ఎవరూ కోరుకోని విద్యాశాఖను సవాలగా స్వీకరించానని చెప్పారు. విద్యాశాఖను ప్రక్షాళన చేయడమే నా తదుపరి లక్ష్యం. నేను బాధ్యతలు స్వీకరించినప్పుడు ఈశాఖలో విద్యార్థులకు సంబంధించిన సరైన డేటా కూడా లేదు. గుడ్లు, చిక్కీలు, యూనిఫాంలు... ఇలా ప్రతి అంశంలో రాజకీయ జోక్యంతో భ్రష్టు పట్టించారు. మేం అధికారంలోకి వచ్చాక విద్యారంగాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని నిర్ణయించాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు మీద విద్యా కిట్‌లు అందించాం, డొక్కా సీతమ్మ పేరు మీద సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా కెజి టు పిజి పాఠ్యాంశాల్లో మార్పులు తెచ్చాం. చిన్నారుల సమగ్ర విద్యాభ్యాసం కోసం లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ( LEAP) మోడల్ ను ప్రవేశపెట్టాం. వన్ క్లాస్ – వన్ టీచర్ విధానంతో 9,600 మోడల్ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటుచేశాం. తల్లికి వందనం పథకం కింద 67.27 లక్షలమంది విద్యార్థుల తల్లుల ఎకౌంట్లకు రూ.10 వేల కోట్లు జమచేశామని నారా లోకేష్‌ వివరించారు.

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో మెగా డిఎస్సీని ప్రకటించి, ఇటీవలే విజయవంతంగా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించాం, త్వరలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టబోతున్నామని విద్యాశాఖ మంత్రి. నారాలోకేష్‌ తెలిపారు. టీచర్ ట్రాన్సఫర్ యాక్ట్ ద్వారా అత్యంత పారదర్శకంగా 67,732 మంది ఉపాధ్యాయుల బదిలీలు, 4,477 మందికి పదోన్నతులు కల్పించాం. రాష్ట్రవ్యాప్తంగా మెగా పిటిఎం కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహిస్తూ విద్యాప్రమాణాల మెరుగుదలకు తల్లిదండ్రుల సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నాం. ఈనెల 10వతేదీన మెగా పిటిఎం నిర్వహిస్తున్నాం. విలువలతో కూడిన విద్యకు ప్రాధాన్యతనిస్తూ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు గారిచే నైతిక విద్యపై పుస్తకాలు, వీడియోలు తయారుచేసి విద్యార్థులకు అందిస్తున్నాం. తరగతి గది నుంచే మహిళలను గౌరవించే పాఠ్యాంశాల బోధనతోపాటు, వారికి పాఠశాలల్లో సురక్షితమైన వాతావరణం కల్పిస్తున్నాం. పాఠ్యాంశాల్లో ఇంటిపనులు స్త్రీ,పురుషులకు సమానంగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. ప్రతి శనివారం నో బ్యాగ్ డే గా ప్రకటించి, ఆరోజున యోగా, పిట్ నెట్, క్రీడలు వంటి విద్యేతర కార్యక్రమాలపై దృష్టిసారించేలా చర్యల చేపట్టాం.

విఆర్ స్కూలు సౌకర్యాలు చూసి నాకు ఆనందం కలుగుతోంది. మంగళగిరి నియోజకవర్గం నిడమర్రులో కూడా ఇదేవిధంగా స్కూలును అభివృద్ధి చేస్తున్నామని లోకేష్‌ అన్నారు. రాబోయే అయిదేళ్లలో విఆర్ హైస్కూలు తరహాలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 నియోజకవర్గాల్లో లీప్ మోడల్ స్కూళ్లను అభివృద్ధిచేస్తామని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కేవలం ఒక సంవత్సరంలోనే విద్యారంగంలో గణనీయమైన మార్పులు తెచ్చామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలతో పోటీ పడుతున్నాయి. విఆర్ మున్సిపల్ హైస్కూల్‌లో ఆధునిక తరగతి గదులు, రక్షిత తాగునీటి సౌకర్యం, స్మార్ట్ బోర్డులు తదితర సౌకర్యాలన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఉపాధ్యాయ కొరత లేకుండా తగిన సంఖ్యలో టీచర్లను నియమించారని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ తెలిపారు.

Updated On 7 July 2025 4:00 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story