5 అద్భుతమైన అలవాట్లు ఇవే

5 Amazing Habits to Overcome Stress: నేటి ఆధునిక ప్రపంచంలో ఒత్తిడి ఒక మహమ్మారిగా మారింది. పని, కుటుంబం, అంతులేని బాధ్యతల కారణంగా అనేకమంది ఒత్తిడితో కూడిన జీవనాన్ని గడుపుతున్నారు. ఈ ఒత్తిడి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సరైన నిద్ర, విశ్రాంతి లేకపోవడం వల్ల ఒత్తిడి, నిరాశకు గురై దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి, ఆరోగ్యకరమైన జీవితానికి ఒత్తిడిని తగ్గించుకోవడం అత్యవసరం. మీరు కూడా ఒత్తిడితో సతమతమవుతున్నారా? అయితే, ప్రతి రాత్రి పడుకునే ముందు ఈ ఐదు అలవాట్లను మీ దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా ఒత్తిడిని సమర్థవంతంగా దూరం చేసుకోవచ్చు:

పడుకునే ముందు డిజిటల్ డిటాక్స్:

చాలా మంది ఇల్లు చేరిన తర్వాత కూడా మొబైల్ ఫోన్లకే అంకితమవుతారు. కానీ ఈ పరికరాల నుండి వెలువడే నీలి కాంతి నిద్రకు తీవ్ర ఆటంకం కలిగిస్తుంది. అందుకే నిద్రకు కనీసం 30 నుండి 60 నిమిషాల ముందు మీ మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలను పూర్తిగా ఆఫ్ చేయండి. ఆ సమయాన్ని ఒక మంచి పుస్తకం చదవడానికి లేదా ప్రియమైన వారితో మాట్లాడటానికి కేటాయించండి. ఈ డిజిటల్ డిటాక్స్ మంచి నిద్రకు దోహదపడటమే కాకుండా ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

లోతైన శ్వాస లేదా ధ్యానం

పడుకునే ముందు లోతైన శ్వాస వ్యాయామాలు లేదా ధ్యాన పద్ధతులను అభ్యసించడం ఒత్తిడిని నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ప్రశాంత వాతావరణంలో, మంచం మీద కూర్చుని ధ్యానం చేయండి. ఇది శరీరం, మనస్సు రెండింటినీ విశ్రాంతి స్థితిలోకి తీసుకువస్తుంది, తద్వారా త్వరగా నిద్ర పట్టేందుకు సహాయపడుతుంది.

మీకోసం సమయం కేటాయించుకోండి

పనిలో మాత్రమే కాదు, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీ శరీరానికి, మనస్సుకు తగినంత విశ్రాంతి ఇవ్వండి. చర్మ సంరక్షణపై దృష్టి పెట్టండి, ప్రశాంతంగా, ఆరోగ్యకరమైన భోజనం తీసుకోండి. ఈ సమయంలో మొబైల్ ఫోన్‌కు దూరంగా ఉండటం ద్వారా మీరు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు.

జర్నలింగ్ (

ఒత్తిడిని తగ్గించుకోవడానికి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి జర్నలింగ్ ఒక గొప్ప మార్గం. రోజులో జరిగిన ముఖ్యమైన కార్యకలాపాలు, ముఖ్యంగా మిమ్మల్ని బాధించిన లేదా ఆందోళన కలిగించిన భావాలను ఒక పుస్తకంలో రాయండి. ఈ ప్రక్రియ మీ మనసుకు విశ్రాంతినిచ్చి తేలికపరుస్తుంది.

యోగా లేదా స్ట్రెచింగ్ చేయండి

తేలికపాటి యోగా లేదా సులభమైన స్ట్రెచింగ్ వ్యాయామాలు రోజంతా అలసిపోయిన కండరాలను సడలిస్తాయి. రాత్రిపూట శవాసనం, బాలాసనం వంటివి చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, శరీరం రిలాక్స్ అవుతుంది. వీటితో పాటు, సమయానికి భోజనం చేయడం, ఆ తర్వాత కొద్దిసేపు నడవడం లేదా స్ట్రెచింగ్ చేయడం మంచిది.

సమయపాలన

ఈ రోజుల్లో చాలామంది సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతూ ఆలస్యంగా నిద్రపోతున్నారు. తక్కువ నిద్ర కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. అందుకే మీరు సరైన నిద్ర పొందడానికి సమయానికి పడుకునే అలవాటును పెంపొందించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story