Teeth: మన రోజువారీ అలవాట్లే మన పళ్ల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని మీకు తెలుసా? మనం సాధారణ అనుకునే కొన్ని పనులు దంతాల ఎనామిల్‌ను నాశనం చేసి, పిప్పి పళ్లు, చిగుళ్ల సమస్యలకు దారితీస్తాయి. ప్రముఖ ఆర్థోడాంటిస్ట్ (Orthodontist) వెల్లడించిన, మన దంతాల ఆరోగ్యాన్ని పాడుచేసే 5 అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!

1. పళ్లను గట్టిగా బ్రష్ చేయడం:చాలామంది పళ్లు తెల్లగా మెరవాలని గట్టిగా, వేగంగా తోస్తుంటారు. కానీ అలా గట్టిగా బ్రష్ చేయడం వల్ల పళ్లపై ఉండే రక్షణ పొర 'ఎనామిల్' అరిగిపోతుంది. అంతేకాకుండా చిగుళ్లు దెబ్బతిని సున్నితత్వం (Sensitivity) పెరుగుతుంది. ఎప్పుడూ మెత్తటి బ్రష్‌తో (Soft Bristles) గుండ్రటి కదలికల్లో సున్నితంగా మాత్రమే బ్రష్ చేయాలి.

2. కూల్ డ్రింక్స్, యాసిడ్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం

సోడాలు, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ ,నిమ్మరసాలు తరచూ తాగడం వల్ల దంతాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. వీటిలోని ఆమ్లాలు (Acids) ఎనామిల్‌ను బలహీనపర్చగా.. చక్కెరలు బ్యాక్టీరియాను పెంచి పళ్లు పుచ్చిపోయేలా (Cavities) చేస్తాయి. ఇలాంటి డ్రింక్స్ తాగిన వెంటనే నీటితో నోటిని శుభ్రం చేసుకోవడం మంచిది.

3. తరచూ ఆహారం తింటూ ఉండటం

రోజంతా ఏదో ఒకటి తింటూ ఉండే అలవాటు కూడా పళ్లకు హానికరం. మనం ఏది తిన్నా నోట్లోని బ్యాక్టీరియా యాసిడ్లను ఉత్పత్తి చేస్తుంది. రోజంతా తింటూ ఉంటే నోట్లో లాలాజలం (Saliva) ఆ యాసిడ్లను నిర్వీర్యం చేసే సమయం దొరకక పళ్లు త్వరగా పాడవుతాయి.

4. ఆహారేతర వస్తువులను కొరకడం :టెన్షన్‌లో ఉన్నప్పుడు గోళ్లు కొరకడం, పెన్నులు, పెన్సిళ్లు లేదా ఐస్ ముక్కలను కొరకడం చాలామందికి అలవాటు. ఈ అలవాటు వల్ల పళ్లపై అనవసర ఒత్తిడి పడి సూక్ష్మమైన పగుళ్లు (Micro-cracks) ఏర్పడతాయి. కొన్నిసార్లు పళ్లు విరిగిపోయే ప్రమాదం కూడా ఉంది.

5. డ్రై మౌత్ లేదా నోరు పొడిబారడాన్ని నిర్లక్ష్యం చేయడం

నోటి ఆరోగ్యంలో లాలాజలం (Saliva) కీలక పాత్ర పోషిస్తుంది. ఇది బ్యాక్టీరియాను కడిగేసి, నోటిని శుభ్రంగా ఉంచుతుంది. శరీరంలో నీటిశాతం తగ్గడం లేదా కొన్ని రకాల మందుల వల్ల నోరు పొడిబారితే పిప్పి పళ్లు, నోటి దుర్వాసన, చిగుళ్ల వ్యాధులు త్వరగా వస్తాయి. కాబట్టి రోజూ తగినంత నీరు తాగడం ముఖ్యం.

PolitEnt Media

PolitEnt Media

Next Story