జుట్టు సమస్యలకు అదిరే చిట్కాలు ఇవే..

Health: ప్రస్తుత కాలంలో జుట్టు సమస్యలు కామన్ అయిపోయాయి. స్త్రీలు మాత్రమే కాకుండా పురుషులు సైతం హెయిర్ సమస్యలతో బాధపడుతున్నారు. మగవారిలో జుట్టు తక్కువగా పెరుగుతుంది కాబట్టి వారి జుట్టు సమస్యలు స్త్రీల కంటే భిన్నంగా ఉంటాయి. మగవారిలో పొడి జుట్టు, చుండ్రు వంటి సమస్యలు రావడం కామన్. వాటికి షాంపూ లేదా నూనె రాస్తే సరిపోదు. సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టు పొడిబారకుండా కొన్ని సహజ నివారణలను ఉపయోగించాలి. దీంతో పొడి జుట్టుతో పాటు చుండ్రు వంటి ప్రాబ్లమ్స్ క్రమంగా తొలగిపోతాయి. కొన్ని రోజువారీ అలవాట్లతో జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

డైలీ జుట్టుకు షాంపూ పెట్టడం వల్ల సహజ నూనెలు మాయమవుతాయి. వారానికి రెండుసార్లు మాత్రమే షాంపూ పెట్టాలి.

UV సూర్య కిరణాలు చర్మాన్ని మాత్రమే కాకుండా జుట్టును సైతం దెబ్బతీస్తాయి. కాబట్టి ఎండలోకి వెళ్లేముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ లేదా టోపీ పెట్టుకోవాలి.

నీళ్లు కూడా జుట్టును దెబ్బతీస్తాయి. ఉప్పు లేదా క్లోరిన్ కలిగిన నీరు జుట్టు నుండి తేమను తీసేస్తుంది. ఇటువంటి టైమ్ లో నిమ్మకాయ నీరు లేదా ఆపిల్ సైడర్ వెనిగర్ తో జుట్టును క్లీన్ చేసుకోవాలి.

వేడి నీరు తలలోని తేమను లాగేస్తుంది. జుట్టును క్లీన్ చేసుకునేందుకు ఎప్పుడూ చల్లటి నీటినే వాడాలి. ఇది జుట్టు మెరుపును కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

లీవ్-ఇన్ కండిషనర్ జుట్టులో తేమ ఉండేలా చేస్తుంది. దీన్ని జుట్టుకు అప్లై చేసి 20-30 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత నీటితో కడుక్కుంటే మంచి ఫలితాలుంటాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story