Breastfeeding Mothers Self-Medicating: తల్లి పాలు నవజాత శిశువులకు అమృతం లాంటివి. బిడ్డ ఎదుగుదలకు, రోగనిరోధక శక్తి పెరగడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. అయితే పాలిచ్చే తల్లులకు తలనొప్పి, జ్వరం, దగ్గు వంటి సాధారణ సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల నుంచి సొంతంగా మందులు కొని వాడుతుంటారు. ఇలాంటి "సొంత వైద్యం" తల్లి ఆరోగ్యానికే కాకుండా పాలు తాగే పసిబిడ్డ ప్రాణాలకు కూడా ముప్పు తెస్తుందని తాజా వైద్య పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

సొంత వైద్యం ఎందుకు ప్రమాదకరం? ప్రధాన కారణాలు..

తల్లి నోటి ద్వారా తీసుకునే దాదాపు ప్రతి మందు లేదా రసాయనం రక్తంలో కలిసి, ఆపై తల్లి పాల ద్వారా బిడ్డ శరీరంలోకి ప్రవేశిస్తుంది. తల్లుల శరీరం ఈ మందులను తట్టుకోగలిగినా, పసిబిడ్డల కాలేయం , కిడ్నీలు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఆ రసాయనాలను విచ్ఛిన్నం చేయలేవు.

తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్:

తల్లి వాడే కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్, యాంటీబయోటిక్స్ వల్ల శిశువుల్లో విపరీతమైన నిద్రమత్తు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, మగత, వాంతులు, అరుదైన సందర్భాల్లో మెదడు, కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది.

తల్లి పాలు తగ్గిపోయే ప్రమాదం: పాల ఉత్పత్తి.

జలుబు, అలర్జీల కోసం సాధారణంగా వాడే కొన్ని యాంటీహిస్టామైన్లు, డీకంజెస్టెంట్లు వంటి మందులు తల్లి శరీరంలో పాల ఉత్పత్తిని గణనీయంగా తగ్గించేస్తాయి.

నెలలు నిండని పిల్లలకు మరింత ప్రమాదం:

నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు, నవజాత శిశువులకు ఈ రసాయనాల వల్ల ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. 6 నెలలు దాటిన పిల్లలతో పోలిస్తే, పుట్టిన కొత్తలో పిల్లల అవయవాలు చాలా సున్నితంగా ఉంటాయి.

పాలిచ్చే తల్లులు ఏం చేయాలి?

వైద్యుల సలహా తప్పనిసరి:

చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా సరే, పాలిచ్చే తల్లులు ఖచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించి, తాము పాలిస్తున్నామనే విషయాన్ని చెప్పి మందులు తీసుకోవాలి.

టైమింగ్ ముఖ్యం:

ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మందులు వాడాల్సి వస్తే, డాక్టర్ సలహా మేరకు బిడ్డకు పాలు ఇచ్చిన వెంటనే మందులు వేసుకోవాలి. దీనివల్ల తదుపరిసారి పాలు ఇచ్చే సమయానికి పాలలో మందుల ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది.

లక్షణాలను గమనించండి:

మీరు ఏదైనా మందు వాడుతున్నప్పుడు బిడ్డలో విపరీతమైన నిద్రమత్తు, పాలు తాగడానికి నిరాకరించడం, లేదా ఒంటిపై రాషెస్ (మచ్చలు) వంటివి కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story