Health: మానవ శరీర నిర్మాణం ఒకదానిపై ఒకటి ఆధారపడిన అవయాలతో నిర్మితమై ఉంటుంది. అదే విధంగా బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ ఒకదానిపై మరోటి ఆధారపడి ఉంటాయి. అయితే బాడికి కవాల్సిన మూలకాలు చాలా ఉన్నప్పటికీ అతిముఖ్యమైనది పొటాషియం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బాడీలో పొటాషియం లెవల్స్ సమృద్ధిగా ఉంటే.. దాదాపు అన్నింటిని సమన్వయం చేస్తుందంటున్నారు.

పొటాషియం బాడీ మెటబాలిజం కీలక పాత్ర పోషించే చాలా ముఖ్యమైన ఖనిజం.. అంతకు మించీ ఎలక్ట్రోలైట్. బాడీ ఫ్లూయిడ్స్ ను బ్యాలెన్స్ చేయడం,నరాల సంకేతాలు, కండరాల సంకోచాలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

అరటిపండ్లు, పాలకూర, అవకాడోలు, చిలగడ దుంపలు, బీన్స్ వంటి ఆహారాలలో సమృద్ధిగా లభించే పొటాషియం గుండె ఆరోగ్యం, మూత్రపిండాల పనితీరు, మొత్తం కణ కార్యకలాపాలకు చాలా అవసరం. తగిన మొత్తంలో తీసుకుంటే పొటాషియం చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది.

శరీరంలో అధిక రక్తపోటుకు ప్రధాన కారణమైన కారణం సోడియం. దీని ప్రభావాలను ఎదుర్కోవడానికి పొటాషియం సహాయపడుతుంది.రక్తనాళాల గోడలను సడలించడం , మూత్రం ద్వారా సోడియం బయటకు పంపడం ద్వారా బ్లడ్ ప్రెజర్ స్థాయిలను నియంత్రిస్తుంది.పొటాషియంను నిరంతరం తీసుకోవడం వల్ల గుండె కండరాల సంకోచ, వ్యాకోచాలు సరిగ్గా ఉంటాయి. బాడీలో పొటాషియం తక్కువ ఉంటే గుండె పనితీరును దెబ్బతీస్తుంది.

చాలా మందికి కాసేపు అలా ఒరిగి కూర్చుంటే కండరాలు బగ్గరగా అయిపోయి తిమ్మిరి పట్టినట్లు అవుతుంది. దీనికి కారణం బాడీలో పొటాషియం సమపాళ్లలో లేకపోవడమే. ఈ మూలకం లేకపోవడం వల్ల తిమ్మిర్లు, కండరాల నొప్పులు, వీక్ నెస్ మొదలైన సమస్యలకు దారి తీస్తుంది.పండ్లు, కూరగాయల నుంచి వచ్చే పొటాషియం కిడ్నీలో క్యాల్షియం లోపాన్ని నియంత్రిస్తుంది. క్యాల్షియం ఆధారంగా ఏర్పడే రాళ్లను తగ్గిస్తుంది. అదే విధంగా బాడీలో ఉండే వ్యర్థ పదార్థాలు, కెమికల్స్ ను మూత్రం ద్వారా బయటకు పంపించడంలో సహాయపడుతుందది.

PolitEnt Media

PolitEnt Media

Next Story