ఈ మార్పులు ప్రోస్టేట్ క్యాన్సర్‌కు సంకేతమా?

Sign of Prostate Cancer: మారుతున్న జీవనశైలి కారణంగా పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ వ్యాధి ప్రమాదకరమైన విషయం ఏమిటంటే.. ప్రారంభ దశలో దీని లక్షణాలు చాలా స్వల్పంగా ఉంటాయి. వ్యాధి ముదిరే కొద్దీ చికిత్స కష్టతరమవుతుంది కాబట్టి ముందస్తు సంకేతాలను గుర్తించడం అత్యంత ముఖ్యం.

గుర్తించాల్సిన ప్రధాన లక్షణాలు

మూత్రంలో రక్తం : మీరు మూత్ర విసర్జన చేసే సమయంలో మూత్రం గులాబీ, ఎరుపు లేదా గోధుమ రంగులో కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ఇది ప్రోస్టేట్ గ్రంథిలో సమస్యకు ప్రాథమిక సంకేతం కావచ్చు.

మూత్ర విసర్జనలో ఇబ్బందులు: చాలామందికి మూత్రం వస్తున్నట్లు అనిపిస్తుంది కానీ సరిగ్గా విసర్జించలేరు. క్యాన్సర్ కణాలు పెరిగే కొద్దీ మూత్రనాళం ఇరుకుగా మారుతుంది. దీనివల్ల మూత్రం పూర్తిగా బయటకు వెళ్లకుండా వెనుకకు ప్రవహించే ప్రమాదం ఉంది. మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపించినా వైద్యుడిని సంప్రదించాలి.

పొత్తికడుపు - నడుము నొప్పి: వృషణ క్యాన్సర్ లేదా ప్రోస్టేట్ సమస్యల వల్ల నడుము దిగువ భాగంలో, పొత్తికడుపులో, గజ్జల ప్రాంతంలో విపరీతమైన నొప్పి రావచ్చు. మూత్రం పూర్తిగా బయటకు వెళ్లకుండా మూత్రాశయంలోనే నిలిచిపోవడం వల్ల ఆ పరిసరాల్లోని కండరాలపై ఒత్తిడి పెరిగి ఈ నొప్పి వస్తుంది.

నిపుణుల సూచన

ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నివారించడం లేదా నియంత్రించడం కొంచెం కష్టమైనప్పటికీ, లక్షణాలను ప్రారంభంలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించవచ్చు.

40 ఏళ్లు దాటిన పురుషులు క్రమం తప్పకుండా ప్రోస్టేట్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

ఆహారంలో మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా రిస్క్‌ను కొంతవరకు తగ్గించవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story