Ignoring Your Fatigue: అలసటను తేలికగా తీసిపారేస్తున్నారా? ఈ 5 సంకేతాలు గమనించండి
ఈ 5 సంకేతాలు గమనించండి

Ignoring Your Fatigue: అలసట లేదా నీరసంగా అనిపించడాన్ని మనం సాధారణంగా ఒత్తిడి, సరిగ్గా నిద్రపోకపోవడం లేదా బిజీ రొటీన్ అని తేలికగా తీసిపారేస్తుంటాం. కానీ కొన్నిసార్లు, ఈ మార్పులు తక్కువ ఐరన్ స్థాయిలతో ముడిపడి ఉండవచ్చు. శరీరంలో ఐరన్ లోపం ఉందనే విషయాన్ని తెలియజేసే కొన్ని ముఖ్యమైన సంకేతాలను వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఒకసారి తెలుసుకుందాం. నిరంతర అలసట నుంచి విపరీతమైన జుట్టు రాలడం వరకు, తేలికగా విస్మరించడానికి వీలులేని ఆ ముఖ్యమైన సంకేతాలు ఇవే
తగినంత నిద్రపోయినా అలసటగా ఉండటం: రాత్రి బాగా నిద్రపోయినప్పటికీ నిరంతరం అలసట కొనసాగుతుంటే, దాన్ని గమనించడం చాలా ముఖ్యం.
ఎల్లప్పుడూ చలిగా అనిపించడం: వాతావరణం ఎలా ఉన్నప్పటికీ, మీరు సాధారణం కంటే ఎక్కువ చలిని అనుభవిస్తుంటే అది ఐరన్ లోపానికి ఒక సంకేతం కావచ్చు.
చిన్న పనులకే ఆయాసం రావడం: రోజూ చేసే సాధారణ పనులకు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఆయాసం వస్తుంటే మీ శరీరానికి ఐరన్ కావాలని అర్థం.
ఎక్కువగా జుట్టు రాలడం: జుట్టు రాలడానికి రకరకాల కారణాలు ఉండవచ్చు, కానీ సాధారణం కంటే ఎక్కువ జుట్టు ఊడిపోతుంటే అది కూడా ఐరన్ లోపాన్ని సూచించవచ్చు.
పాలిపోయిన చర్మం లేదా కంటి లోపలి పొరలు: చర్మం రంగు మారుతుండటం, ముఖ్యంగా చర్మం, కళ్ల లోపలి భాగాలు పాలిపోయినట్లు తెల్లగా కనిపించడం.
ఈ లక్షణాలు కేవలం ఐరన్ లోపం వల్ల మాత్రమే వస్తాయని చెప్పలేం. ఇవి ఇతర ఆరోగ్య సమస్యలకు లేదా పోషకాహార లోపాలకు కూడా దారితీయవచ్చు. మీలో ఇలాంటి లక్షణాలు కొన్ని కలిపి కనిపిస్తే, వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించండి. ఒక చిన్న రక్త పరీక్ష ద్వారా మీ శరీరంలో ఐరన్ స్థాయిలు ఎలా ఉన్నాయో సులభంగా తెలుసుకోవచ్చు
- FatigueTirednessChronicFatiguePersistentFatigueFatigueSymptomsWarningSignsHealthWarningSignsHealthTipsHealthAwarenessWellnessHealthyLifestyleEnergyLevelsExhaustionSleepHealthSleepProblemsMentalWellnessStressManagementNutritionVitaminDeficiencyIronDeficiencyB12DeficiencyThyroidHealthAnemiaLifestyleTipsPreventiveHealthHealthNewsMedicalNewsExpertAdviceHealthyLivingWellnessTipsLatestHealthNewsLatestMedicalNewsLatestTeluguNewsTeluguNewsBreakingNewsLatestNews

