Pouring Oil into Children’s Ears: పిల్లల చెవిలో నూనె వేస్తున్నారా? ఆ పొరపాటు చేస్తే వినికిడి శక్తి పోయే ప్రమాదం..
ఆ పొరపాటు చేస్తే వినికిడి శక్తి పోయే ప్రమాదం..

Pouring Oil into Children’s Ears: గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా చాలా మంది తల్లిదండ్రులు పిల్లల చెవిలో నూనె వేయడం వల్ల నొప్పి తగ్గుతుందని లేదా మైనం కరుగుతుందని నమ్ముతుంటారు. అయితే ఈ పద్ధతి వల్ల పిల్లల ఆరోగ్యం మెరుగుపడటానికి బదులు మరింత క్లిష్టంగా మారుతుందని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ ENT విభాగం అధిపతి ప్రొఫెసర్ రవి మెహర్ స్పష్టం చేశారు.
నూనె వేయడం వల్ల కలిగే 3 ప్రధాన నష్టాలు
ఇన్ఫెక్షన్ పెరుగుదల
చెవిలో నూనె వేయడం వల్ల లోపల తేమ పెరిగి బ్యాక్టీరియా లేదా ఫంగస్ వేగంగా వృద్ధి చెందుతాయి. ఇది ఇన్ఫెక్షన్‌ను నయం చేయడానికి బదులు సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.
వాపు - మంట: నూనె చుక్కల వల్ల చెవి లోపల వాపు రావడం, దురద లేదా విపరీతమైన మంట పుట్టే అవకాశం ఉంది.
కర్ణభేరిపై ప్రభావం:
ఒకవేళ చెవి నుండి చీము లేదా నీరు వస్తున్నప్పుడు నూనె వేస్తే, అది కర్ణభేరికి శాశ్వత నష్టం కలిగించి వినికిడి లోపానికి దారితీయవచ్చు.
చెవి నొప్పి వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి?
పిల్లవాడు పదే పదే ఏడుస్తున్నా లేదా చెవిని పట్టుకుని లాగుతున్నా అది నొప్పికి సంకేతం. వెంటనే ENT నిపుణుడిని సంప్రదించి పరీక్ష చేయించాలి.
ఇయర్‌బడ్స్‌తో జాగ్రత్తచె
విని శుభ్రం చేయడానికి ఇయర్‌బడ్స్ వాడినప్పుడు వాటిని మరీ లోతుగా పంపకూడదు.
నీరు రాకుండా చూడాలి
పిల్లలకు స్నానం చేయించేటప్పుడు లేదా తల స్నానం చేయించేటప్పుడు చెవిలోకి సబ్బు నీరు వెళ్లకుండా జాగ్రత్త పడాలి.
స్వయం వైద్యం వద్దు
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మార్కెట్లో దొరికే ఏ రకమైన ఇయర్ డ్రాప్స్ పిల్లల చెవిలో వేయకూడదు.
ముఖ్య గమనిక
జలుబు లేదా జ్వరం వచ్చినప్పుడు కూడా పిల్లలకు చెవి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు అది కేవలం చెవి సమస్యే కాకపోవచ్చు, లోపల శ్వాసకోస సంబంధిత ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఉండవచ్చు. కాబట్టి, నూనె వేయడం లాంటి ఇంటి చిట్కాల కంటే సరైన చికిత్స తీసుకోవడమే సురక్షితం.

