బాత్రూంలోకి వెళ్తున్నారా?

Are You Taking Your Phone to the Bathroom: మొబైల్‌ను బాత్రూమ్‌కు తీసుకువెళ్లడం వల్ల ప్రత్యక్షంగా పైల్స్ (Piles/Hemorrhoids) వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు

ఫోన్‌లో నిమగ్నమై ఉండటం వల్ల మీరు తెలియకుండానే టాయిలెట్ సీటుపై అవసరమైన దానికంటే ఎక్కువ సమయం గడుపుతారు. మొబైల్ ఫోన్‌తో టాయిలెట్‌కు వెళ్లే అలవాటు ఉన్నవారిలో పైల్స్ వచ్చే ప్రమాదం 46% వరకు ఎక్కువగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం మొబైల్ వాడకం వల్ల టాయిలెట్‌లో గడిపే సమయం పెరగడమే కానీ, మొబైల్ నుంచి వచ్చే తరంగాలు కాదు.

టాయిలెట్ సీటుపై ఎక్కువసేపు కూర్చున్నప్పుడు, గురుత్వాకర్షణ శక్తి కారణంగా పురీషనాళం,పాయువు చుట్టూ ఉన్న రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది.ఈ ఒత్తిడి వల్ల ఆ ప్రాంతంలోని రక్తనాళాలు ఉబ్బి, వాచిపోతాయి. దీనినే పైల్స్ లేదా హేమోరాయిడ్స్ అంటారు.

సాధారణ కుర్చీ లేదా సోఫాలో కూర్చున్నప్పుడు కటి (Pelvic) భాగానికి కొంత మద్దతు లభిస్తుంది.అయితే, టాయిలెట్ సీటుపై కూర్చున్నప్పుడు కటి ఫ్లోర్ కండరాలకు మద్దతు లభించదు. ఎక్కువసేపు మద్దతు లేకుండా కూర్చోవడం వల్ల రక్తనాళాలపై ఒత్తిడి మరింత పెరిగి పైల్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది.

మలవిసర్జన ప్రక్రియ పూర్తయిన తర్వాత వెంటనే టాయిలెట్ నుంచి బయటకు రావడం మంచిది. సాధారణంగా టాయిలెట్‌లో 5 నుండి 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడపకూడదు.

PolitEnt Media

PolitEnt Media

Next Story