Green Chillies for Health

పచ్చి మిర్చి కారంగా ఉంటుందని చాలా మంది తినేందుకు ఆసక్తిని చూపించరు. కూరల్లో వచ్చినా పడేస్తుంటారు. పచ్చి మిర్చిలో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. మన పూర్వీకులతోపాటు పెద్దలు పచ్చి మిర్చిని రోజువారి ఆహారంలో తీసుకునేవారు. పెరుగుతో చద్దన్నంలో నంజుకుని రుచి ఆస్వాదించేవారు. అలాంటి మిర్చి ప్రాధాన్యత నేటి తరానికి తెలియాల్సి ఉంది. పచ్చి మిర్చితో లాభాలు తెలిస్తే ఇష్టంగా తింటారు. అందుకనే ఎంత వయస్సు వచ్చినా ఆరోగ్యంగా ఉండేవారు.

పచ్చి మిర్చిని ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

ఇన్‌ ఫెక్షన్లకు విరుగుడు

ప‌చ్చి మిర్చిలో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. నారింజ పండ్లలో క‌న్నా ప‌చ్చి మిర్చిలోనే అధికంగా విట‌మిన్ సి ఉంటుంద‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. క‌నుక ప‌చ్చిమిర్చిని ఆహారంలో భాగం చేసుకుంటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీంతో శ‌రీరం వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్ల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతుంది. రోగాలు రాకుండా చూస్తుంది. ప‌చ్చి మిర్చిలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది మ‌న శ‌రీరంలో విట‌మిన్ ఎ గా మారుతుంది. దీంతో కంటి చూపు మెరుగు ప‌డుతుంది. క‌ళ్ల స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయి. వృద్ధాప్యంలో వ‌చ్చే శుక్లాలు రాకుండా అడ్డుకోవ‌చ్చు.

కొవ్వు మాయం

ప‌చ్చి మిర్చిలో విట‌మిన్ బి6, బి9 శాతం అధికం. ఇవి శ‌రీర మెట‌బాలిజం మెరుగు పరుస్తాయి. దీంతో క్యాల‌రీలు ఖర్చు కావడంతోపాటు కొవ్వు క‌రిగి బ‌రువు త‌గ్గుతారు. బి6,బి9 విట‌మిన్లతో నాడీ మండ‌ల వ్యవస్థ మెరుగు పడుతుంది. నరాల బ‌ల‌హీనత తగ్గి… మెడ‌, భుజాల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఎర్ర ర‌క్త క‌ణాల ఉత్పత్తి జరిగి ర‌క్తం పెరుగుతుంది. రక్త హీనత త‌గ్గుతుంది. ప‌చ్చిమిర్చిలో అనేక ర‌కాల యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని త‌గ్గిస్తాయి. దీంతో డ‌యాబెటిస్, క్యాన్సర్, గుండె జ‌బ్బులు రాకుండా ఆరోగ్యంగాఉండ‌వ‌చ్చు.

జీర్ణక్రియకు సహకారి

ప‌చ్చిమిర్చిలో క్యాప్సెయిసిన్ అనే స‌మ్మేళ‌నం ఉండటం, థ‌ర్మోజెనిక్ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. వీటితో శ‌రీర ఉష్ణోగ్రతను పెంచినా మెట‌బాలిజం పెరిగి కొవ్వు క‌రుగుతుంది. ప‌చ్చి మిర్చి తింటుంటే బ‌రువు త‌గ్గించుకోవ‌డం తేలిక‌వుతుంది. ప‌చ్చి మిర్చిని తింటే క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. ప‌చ్చి మిర్చి అధికంగా తింటే క‌డుపులో మంట వ‌స్తుంది. తగిన మోతాదులో తింటే జీర్ణ క్రియ‌కు స‌హాయ ప‌డ‌తాయి. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు జిల్లా తక్కెళ్లపాడు మిర్చి ఘాటు ఎక్కువ. ఈ మిర్చి తగిన మోతాదులో వాడితే ఆరోగ్యానికి ఢోకా లేదు.

Politent News Web3

Politent News Web3

Next Story