Black Coffee May Help Manage Fatty Liver: ఉదయాన్నే నిద్రలేవగానే వేడివేడిగా ఒక కప్పు కాఫీ తాగడం మనలో చాలా మందికి ఉన్న అలవాటు. ఇది మనల్ని రోజంతా ఉల్లాసంగా ఉంచుతుంది. అయితే, నేటి మారుతున్న ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేని జీవనశైలి కారణంగా ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య ఫ్యాటీ లివర్. కాలేయంలో అధికంగా కొవ్వు పేరుకుపోయే ఈ పరిస్థితిని ప్రారంభంలోనే అరికట్టకపోతే, అది కాలక్రమేణా లివర్ సిర్రోసిస్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది. కానీ, మనం రోజూ తాగే సాదా బ్లాక్ కాఫీ కి ఫ్యాటీ లివర్‌ను నివారించే అద్భుతమైన సామర్థ్యం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి బ్లాక్ కాఫీ కాలేయాన్ని ఎలా కాపాడుతుంది? రోజుకు ఎంత పరిమాణంలో తాగాలి? వంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కాలేయానికి బ్లాక్ కాఫీ ఎలా మేలు చేస్తుంది?

కాఫీలో ఉండే కొన్ని ప్రత్యేకమైన పోషకాలు కాలేయ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి..

యాంటీఆక్సిడెంట్ల నిధి: బ్లాక్ కాఫీలో ‘క్లోరోజెనిక్ యాసిడ్ వంటి పవర్‌ఫుల్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయంలో వచ్చే వాపును తగ్గించడంలో అద్భుతంగా సహాయపడతాయి.

హానికర ఎంజైమ్‌ల నియంత్రణ:

ప్రతిరోజూ పరిమితంగా బ్లాక్ కాఫీ తాగడం వల్ల కాలేయంలోని హానికరమైన ఎంజైమ్‌ల స్థాయిలు తగ్గి, కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.

కణ నష్టానికి బ్రేక్: కాఫీలోని కెఫిన్ శరీరంలోకి చేరినప్పుడు జరిగే రసాయన చర్యల వల్ల, కాలేయ కణాలను దెబ్బతీసే మచ్చ కణజాలం ఏర్పడకుండా నివారించబడుతుంది.

రోజుకు ఎంత తాగాలి? ఎలా తాగాలి?

ఏదైనా సరే మితిమీరితే అమృతం కూడా విషమే అవుతుంది. అందుకే బ్లాక్ కాఫీ విషయంలోనూ నియమాలు పాటించాలి..

రోజుకు 2 నుండి 3 కప్పులు:

ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ రెండు నుండి మూడు కప్పుల బ్లాక్ కాఫీని మాత్రమే తాగాలి.

చక్కెర అస్సలు వద్దు:

బ్లాక్ కాఫీలో అస్సలు చక్కెర కలపకూడదు. ఎందుకంటే చక్కెర కాలేయంలో కొవ్వును మరింత పెంచుతుంది. తీపి కోసం తేనె వంటివి కూడా కలపకపోవడమే మంచిది.

పాలు కలపవద్దు: ఫ్యాటీ లివర్ ఉన్నవారు పాలు లేని సాదా బ్లాక్ కాఫీ మాత్రమే తాగాలి. పాలలోని కొవ్వు కాఫీ యొక్క సహజ ఆరోగ్య గుణాలను నాశనం చేస్తుంది.

ఉత్తమ సమయం:

దీనిని ఉదయం పూట లేదా భోజనం తర్వాత తాగడం మంచిది.

గమనించవలసిన మరికొన్ని జాగ్రత్తలు

రాత్రి వేళల్లో వద్దు:

కాఫీలో కెఫీన్ ఎక్కువగా ఉండటం వల్ల రాత్రి ఆలస్యంగా తాగితే నిద్రకు భంగం కలుగుతుంది. నిద్ర సరిగ్గా లేకపోతే కాలేయం తనను తాను స్వస్థపరచుకునే సహజ ప్రక్రియ దెబ్బతింటుంది.

అతి సర్వత్ర వర్జయేత్:

కాలేయానికి మంచిదని కప్పుల కొద్దీ కాఫీ తాగడం వల్ల శరీరంలో కెఫీన్ మోతాదు పెరిగి ఇతర ఆరోగ్య సమస్యలు రావచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story