Breast Cancer in Women: సాధారణంగా రొమ్ము క్యాన్సర్ అనేది 50 ఏళ్లు దాటిన మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుందని భావిస్తుంటారు. కానీ ఇటీవల కాలంలో మారిన జీవనశైలి, హార్మోన్ల వ్యత్యాసాలు, ఇతర కారణాల వల్ల 20 నుండి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువతులలో కూడా రొమ్ము క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువతులలో ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం వల్ల చికిత్స సులువవుతుంది. వారు అస్సలు నిర్లక్ష్యం చేయకూడని ప్రధాన లక్షణాలు మరియు గుర్తింపు మార్గాలు ఇవే..

యువతుల్లో కనిపించే తొలి హెచ్చరిక సంకేతాలు..

రొమ్ము లేదా సంక భాగంలో గడ్డలు:

రొమ్ములో లేదా చంక భాగంలో నొప్పి లేని గట్టి గడ్డ ఏర్పడటం అత్యంత సాధారణ తొలి లక్షణం. ముట్టుకున్నప్పుడు తేడాగా అనిపిస్తే వెంటనే పరీక్షించుకోవాలి.

ఆకారం - పరిమాణంలో మార్పులు:

రెండు రొమ్ముల ఆకారంలో లేదా పరిమాణంలో హఠాత్తుగా అసమానతలు రావడం.

చర్మంలో మార్పులు:

రొమ్ముపై చర్మం గుల్లగా డింపుల్స్ (నారింజ తొల పైన ఉన్నట్లు డింపుల్డ్ స్కిన్) రావడం, ఎర్రబడటం లేదా కమిలినట్లు కావడం.

నిపుల్స్‌లో మార్పులు:

నిపుల్ లోపలికి లాక్కున్నట్లు అవ్వడం, నిపుల్ చుట్టూ ఉన్న చర్మం పొరలుగా ఊడిపోవడం లేదా దురదగా ఉండటం.

ద్రవాలు రావడం :

పాలు కాకుండా నిపుల్స్ నుండి స్రావాలు లేదా రక్తంతో కూడిన ద్రవాలు కారడం.

తీవ్రమైన నొప్పి:

పీరియడ్స్ సమయంలో వచ్చే సాధారణ నొప్పి కాకుండా,

రొమ్ములో లేదా నిపుల్ భాగంలో నిరంతరం ఒకే చోట నొప్పి ఉండటం.

యువతులు దీనిని ఎలా గుర్తించాలి?:

స్వయం పరీక్ష :

ప్రతినెల పీరియడ్స్ పూర్తయిన 3-5 రోజుల తర్వాత మహిళలు ఇంట్లోనే స్వయంగా రొమ్ములను పరిశీలించుకోవాలి

ఫ్యామిలీ హిస్టరీని తెలుసుకోవడం:

కుటుంబంలో ఎవరికైనా చిన్న వయసులోనే రొమ్ము లేదా అండాశయ క్యాన్సర్ వచ్చి ఉంటే, మరింత జాగ్రత్తగా ఉండాలి.

వార్షిక హెల్త్ చెకప్:

20 ఏళ్లు దాటిన యువతులు ఏటా డాక్టర్ వద్ద క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం మంచిది.

ముందస్తు నివారణ - జీవనశైలి చిట్కాలు:

ఆరోగ్యకరమైన బరువు:

శరీర బరువును అదుపులో ఉంచుకోవడం.

వ్యాయామం: రోజూ కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రమ లేదా వాకింగ్ చేయడం.

మద్యపానం - పొగత్రాగడం దూరంగా పెట్టడం.

సమతుల్యాహారం:

ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించి, పీచు పదార్థాలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం.

PolitEnt Media

PolitEnt Media

Next Story