Heart Attack Be Detected Early with an ECG: ఈసీజీతో గుండెపోటును ముందే గుర్తించవచ్చా.?
గుండెపోటును ముందే గుర్తించవచ్చా.?

Heart Attack Be Detected Early with an ECG: ఈసీజీ రిపోర్ట్ నార్మల్‌గా ఉన్నంత మాత్రాన గుండెపోటు ముప్పు నిర్దారంచ వచ్చా అంటే.. నిర్ధారించలేమని డాక్టర్లు చెబుతున్నారు. ఈసీజీ కేవలం ఆ క్షణంలో గుండె స్థితిని మాత్రమే చూపిస్తుంది. గుండెపోటుకు కొన్ని గంటల ముందు తీసిన ఈసీజీ కూడా చాలా మందిలో నార్మల్‌గా వచ్చే అవకాశం ఉంది. రక్తనాళాల్లో పూడికలు ఎప్పుడు పగిలి గుండెపోటు వస్తుందో ముందే ఊహించలేదు.
ఒకవేళ ఈసీజీలో స్పష్టత లేకపోయినా, లక్షణాలు (ఛాతి నొప్పి, చెమటలు పట్టడం) ఉంటే డాక్టర్లు ఈ క్రింది పరీక్షలు చేస్తారు.ట్రోపోనిన్ టెస్ట్ ఇది రక్త పరీక్ష. గుండె కండరం దెబ్బతిన్నప్పుడు రక్తంలోకి విడుదలయ్యే ప్రోటీన్లను ఇది గుర్తిస్తుంది. గుండెపోటు నిర్ధారణలో ఇది చాలా ఖచ్చితమైనది.
2D ఎకో గుండె పనితీరును, గదుల కదలికలను చూడటానికి ఇది ఉపయోగపడుతుంది.యాంజియోగ్రామ్ (Angiogram)రక్తనాళాల్లో పూడికలు (Blocks) ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది చేస్తారు.
మీకు లేదా మీ చుట్టుపక్కల ఎవరికైనా ఛాతి నొప్పి, ఎడమ చేయి లాగడం, విపరీతమైన చెమటలు పట్టడం వంటి లక్షణాలు ఉంటే, ఈసీజీ రిపోర్ట్ కోసం వేచి చూడకుండా వెంటనే అత్యవసర వైద్య సహాయం (Emergency Care) అందించడం ముఖ్యం.
నిర్లక్ష్యం చేయకుండా ఇతర పరీక్షలు చేయించుకోవాలి’ అని సూచిస్తున్నారు.

