Hypertension and Diabetes Patients Donate Blood: రక్తదానం.. ప్రాణదానంతో సమానం. ఒక వ్యక్తి ఇచ్చే రక్తం మరొకరి జీవితాన్ని కాపాడుతుంది. అందుకే రక్తదానాన్ని అత్యంత పవిత్రమైన కార్యంగా భావిస్తారు. అయితే, రక్తం ఇచ్చే ప్రతి ఒక్కరూ కొన్ని ఆరోగ్య ప్రమాణాలను పాటించడం తప్పనిసరి. మనం చేసే సాయం ఇతరులకు మేలు చేయడంతో పాటు, మన ఆరోగ్యానికి కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి.

రక్తదానం చేయడానికి ముందు వైద్యులు కొన్ని ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారు, క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడేవారు రక్తదానానికి దూరంగా ఉండాలి. అదేవిధంగా, షుగర్ (డయాబెటిస్), బీపీ ఉన్నవారు కూడా రక్తం ఇచ్చే విషయంలో వైద్య నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పల్స్ రేటు సాధారణంగా ఉన్నవారు మాత్రమే రక్తదానానికి అర్హులు.

అధిక రక్తపోటు (High BP) ఉన్నవారు రక్తదానం చేస్తే ఏమవుతుంది? అన్నది చాలా మందిలో ఉండే సందేహం. సాధారణంగా బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు రక్తదానం చేయడం వల్ల దాత శరీరంలో రక్తపోటు మరింత పెరిగే ప్రమాదం ఉంది. దీనివల్ల తీవ్రమైన తల తిరగడం, కళ్ళు తిరగడం లేదా స్పృహ తప్పి పడిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే రక్తం తీసిన తర్వాత శరీరంలోని రక్త ప్రసరణ వ్యవస్థలో వచ్చే మార్పులను అధిక బీపీ ఉన్న శరీరం తట్టుకోలేకపోవచ్చు.

వైద్య నిపుణుల ప్రకారం.. బీపీ లేదా షుగర్ నియంత్రణలో లేని వారు రక్తం ఇస్తే, అది వారి గుండెపై అదనపు భారాన్ని పెంచుతుంది. అందుకే మీ బీపీ 180/100 కంటే ఎక్కువగా ఉంటే రక్తదానానికి అనుమతించరు. మీరు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడుతున్నట్లయితే, ఆ విషయాన్ని ముందే డాక్టర్లకు తెలపడం బాధ్యతాయుతమైన పని.

Next Story