Nail Polish Cause Cancer: ఈ రోజుల్లో గోళ్లకు నెయిల్ పాలిష్ వేసుకోవడం, రకరకాల కలర్స్, జెల్ నెయిల్స్ మార్చుకోవడం ప్రతీ ఒక్కరికీ ఒక ట్రెండ్‌గా మారింది. కానీ, ఈ మెరిసే అందాల వెనుక మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదకరమైన నిజాలు ఉన్నాయని మీకు తెలుసా? నెయిల్ పాలిష్‌ల వాడకం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని క్యాన్సర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మనలో చాలామంది నెయిల్ పాలిష్‌ను కేవలం పైపైన వేసుకునే అందం అనుకుంటారు. కానీ, సాధారణ నెయిల్ పాలిష్‌లలో ఫార్మాల్డిహైడ్ (Formaldehyde), టోలుయీన్ (Toluene), DBP (Dibutyl Phthalate) వంటి అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు (Toxic Chemicals) ఉంటాయి. ఇందులో 'ఫార్మాల్డిహైడ్' అనే రసాయనాన్ని 'వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్' గ్రూప్-1 కార్సినోజెన్—అంటే క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదకర పదార్ధంగా వర్గీకరించింది.

మనం తరచుగా వీటిని వాడినప్పుడు, ఆ రసాయనాలు గోళ్ల ద్వారా శరీరంలోకి ఇంకిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ మధ్యకాలంలో చాలామంది జెల్ నెయిల్స్ (Gel Nails) ఎక్కువ రోజులుంటాయని వేసుకుంటున్నారు. ఈ జెల్ నెయిల్ పాలిష్‌ను ఆరబెట్టడానికి సెలూన్లలో UV ల్యాంప్స్ (Ultraviolet Lamps) వాడతారు. ఈ ల్యాంప్స్ నుంచి వచ్చే కిరణాలు చర్మ కణాల్లోని DNAను దెబ్బతీసి, స్కిన్ క్యాన్సర్ (Skin Cancer) వచ్చే ముప్పును పెంచుతాయని నిపుణులు చెప్తున్నారు.

మరి దీనికి పరిష్కారం ఏమిటి?

కెమికల్స్ లేనిToxic-Free లేదా 5-Free, 7-Free అని రాసి ఉన్న సురక్షితమైన నెయిల్ పాలిష్‌లను ఎంచుకోండి.వీలైనంత వరకు జెల్ నెయిల్స్, UV లైట్ డ్రైయర్లను తగ్గించండి. రోజూ నెయిల్ పాలిష్‌లతో గోళ్లను కప్పి ఉంచకుండా, గోళ్లకు కాస్త గాలి ఆడే సమయం ఇవ్వండి.

Next Story