గుండె సమస్యలు వస్తాయా?

Heart Problems: అతిగా నిద్రపోవడం వల్ల గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ విషయంపై చాలా పరిశోధనలు జరిగాయి. నిపుణులు ఈ విషయాన్ని ధృవీకరించారు. సాధారణంగా ఒక వ్యక్తి రోజుకు 7-8 గంటలు నిద్రపోవడం ఆరోగ్యకరం. కానీ, మీరు రోజుకు తొమ్మిది గంటల కంటే ఎక్కువ నిద్రపోతే గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ నిద్రపోవడం వల్ల శరీరంలోని కొన్ని జీవక్రియలు నెమ్మదిగా పని చేస్తాయి. ఇది రక్తనాళాలపై ఒత్తిడిని పెంచుతుంది.అతిగా నిద్రపోయే వారికి మధుమేహం వచ్చే ప్రమాదం కూడా అధికం. మధుమేహం ఉన్నవారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ నిద్ర వల్ల శారీరక శ్రమ తగ్గుతుంది. ఇది ఊబకాయానికి దారితీస్తుంది. ఊబకకాయం గుండె జబ్బులకు ఒక ప్రధాన కారణం. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు రోజుకు 7-8 గంటల పాటు నిద్రపోవడం చాలా ముఖ్యం. మీకు నిద్ర సమస్యలు ఉంటే, వైద్య నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం.

PolitEnt Media

PolitEnt Media

Next Story