Spinach: పాలకూరతో బెల్లి ఫ్యాట్ తగ్గుతుందా..?
బెల్లి ఫ్యాట్ తగ్గుతుందా..?

Spinach: పాలకూర శరీర కొవ్వును తగ్గించడానికి, ఆకలిని నియంత్రించడానికి, వాపును తగ్గించడానికి సహాయపడే కూరగాయ అని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతే కాదు శరీర కొవ్వును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. డైటీషియన్లు పాలకూరను బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడంలో సహాయపడే కూరగా అభివర్ణిస్తారు. వాటిలో కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ల్యూటిన్, జియాక్సంతిన్ కొవ్వును తగ్గించడం, వాపును తొలగించడంలో సహాయపడతాయి.
పాలకూరలోని థైలాకోయిడ్స్ ఆకలిని తగ్గిస్తాయని, భోజనం తర్వాత కడుపు నిండినట్లు అనిపించే హార్మోన్లను ప్రేరేపిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది ఆకలిని ప్రేరేపించే ఎంజైమ్‌ల కార్యకలాపాలను కూడా తగ్గిస్తుంది.
ఒక కప్పు వండిన పాలకూరలో నాలుగు గ్రాముల ఫైబర్ ఉంటుందని చెబుతారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.దీనివల్ల ఆకలి కూడా తగ్గుతుంది. కొలెస్ట్రాల్, గ్లూకోజ్‌ను నియంత్రించడంలో పాలకూర కూడా మంచిది.Can Spinach Help You Lose Belly Fat?
