గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందా?

Tomatoes: టమాటా అనేది ప్రపంచవ్యాప్తంగా వంటలలో విస్తృతంగా ఉపయోగించే ఒక ముఖ్యమైన కూరగాయ. టామాట లేనిది చాలా మంది కూర కూడా వండరు. ప్రతి కూరలోనూ దీనిని ఉపయోగిస్తారు. కర్రీ, సాంబారు, చట్నీ రకరకాలుగా దీనిని వాడుతారు. వృక్షశాస్త్రం ప్రకారం ఇది ఒక పండు. టమాటాను "సీమ వంగ" లేదా "రామ ములగ" అని కూడా అంటారు.

టమాటాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి,

పోషకాలు పుష్కలం

టమాటాలలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, పొటాషియం, ఫోలేట్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.

టమాటాల్లో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, రక్తపోటును నియంత్రిస్తుంది, మరియు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

టమాటాల్లో ఉండే విటమిన్ ఎ, లైకోపీన్, బీటా-కెరోటిన్ కళ్ళ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి కంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.

విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఇవి చర్మ సమస్యలను తగ్గించి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడతాయి. టమాటా రసాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల కూడా చర్మం తాజాగా మారుతుంది.

లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్లను (ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్) నివారించడంలో సహాయపడతాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story