Health:కరివేపాకు మొక్కను ఇంట్లో పెంచుకోవచ్చా?
మొక్కను ఇంట్లో పెంచుకోవచ్చా?

Health: కరివేపాకు లేనిది చిన్న వంట కూడా వండలేరు. అయితే కరివేపాకును చాలా మంది లైట్ తీసుకుంటారు. కూరల్లో కరివేపాకును పక్కన పడేసినట్లుగా దాని గురించి పెద్దగా పట్టించుకోరు అయితే కరివేపాకు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతమేలో..వాటి వల్ల ఇంటికి కూడా మంచిదంట. కరివేపాకను ఏ దిక్కున నాటితే మంచి ఫలితాన్ని ఇస్తుందో తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం కరివేపాకు మొక్కను ఇంట్లో పెంచడం వలన అంతాశుభమే జరుగుతుందని వాస్తు శాస్త్రం ద్వారా తెలుస్తోంది. ఈ మొక్క కేవలం ఆరోగ్య ప్రయోజనాలనే కాకుండా ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని చెబుతున్నారు. ఇంతా పాజిటివ్ ఎనర్జీ సంపద సంతోషాన్ని కూడా కలుగజేసే లక్షణాలు కరివేపాకు మొక్కలో ఉన్నాయి.
ఈ మొక్కను సరైన నాటడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి, ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయని నమ్ముతారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం పడమర దిశ కరివేపాకు మొక్కను నాటడానికి అత్యంత అనుకూలమైంది. ఈ దిశను చంద్రుడి దిశగా పరిగణిస్తారు. ఇక్కడ మొక్కను పెంచడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది, ప్రతికూల శక్తి తొలగిపోయి, ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. దీని ఆకులలో యాంటీ మ్యుటాజెనిక్ గుణాలు ఉండటం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణకు సహాయపడతాయి. కరివేపాకు మొక్క ప్రశాంతతను, మానసిక సమతుల్యతను చేకూర్చుతుంది.
