తస్మాత్ జాగ్రత్త!

Cancer Risk Linked to Incense Stick Smoke: ఇంట్లో సువాసన, ఆధ్యాత్మిక వాతావరణం కోసం ఉపయోగించే అగరబత్తీలు (ధూప్ స్టిక్స్) వాడకంపై ఆరోగ్య నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పలు అధ్యయనాలు, పరిశోధనల ప్రకారం... నాణ్యత లేని అగరబత్తీలలో ప్రమాదకరమైన రసాయనాలు, భార లోహాలు ఉన్నట్లు తేలింది. వీటిని కాల్చడం వల్ల విడుదలయ్యే పొగ, నిశ్శబ్దంగా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా తక్కువ ధర ఉండే, నాణ్యత లేని అగరబత్తీలను తయారు చేయడానికి ఉపయోగించే రంగులు, సువాసనలు మరియు ఇతర సంధాయక పదార్థాలలో ఈ కింది ప్రమాదకర రసాయనాలు ఉంటున్నాయి:

బెంజీన్ & టోలున్ ఇవి కార్సినోజెనిక్ (క్యాన్సర్‌ను కలిగించే) సమ్మేళనాలు. వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (VOCs): ఇవి కళ్లు, గొంతులో మంటను కలిగిస్తాయి.

పార్టిక్యులేట్ మ్యాటర్ (PM 2.5): అగరబత్తీ పొగలో ఈ సూక్ష్మ కణాలు అధికంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులలోకి లోతుగా ప్రవేశించి శ్వాసకోశ సమస్యలను సృష్టిస్తాయి.

పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs): దీర్ఘకాలికంగా వీటిని పీల్చడం వలన క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది.

ఫతాలెట్స్ : కృత్రిమ సువాసనల కోసం వీటిని వాడతారు. ఇవి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి.

అగరబత్తీ పొగ ద్వారా వచ్చే ఈ రసాయనాలు ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు మరియు ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి మరింత ప్రమాదకరం.ఆస్తమా, బ్రాంకైటిస్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) వంటి సమస్యలు పెరగడానికి కారణమవుతాయి. ఎక్కువ కాలం ఈ పొగను పీల్చడం ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. నిద్ర లేమి, తలనొప్పి వంటి నాడీ సంబంధిత సమస్యలకు దారితీయవచ్చు.

అగరబత్తీలను కాల్చేటప్పుడు కిటికీలు, తలుపులు తెరిచి ఉంచి గాలి ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. ఎక్కువ సమయం కాకుండా, తక్కువ సమయం మాత్రమే కాల్చడం ఉత్తమం. కృత్రిమ సువాసనలకు బదులుగా, సహజమైన మూలికలతో (హెర్బల్) తయారైన లేదా ధూపం (సాంబ్రాణి) వంటి సాంప్రదాయ పదార్థాలను వాడటం మంచిది. నాణ్యత లేని ఉత్పత్తులను వినియోగించడం వల్ల ఈ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story