ఈ టిప్స్ పాటించండి

Can't Sleep Until Midnight: అర్థరాత్రి దాటాక కూడా నిద్రపట్టని కొంతమందిని తీసుకుని వాళ్ల మీద బ్రిటన్ సైంటిస్ట్​ లు పరిశోధన చేశారు. వీళ్లు నిద్ర పోయే టైం, నిద్ర లేచే టైం ప్రతి రోజు ఒకేలా ఉంటుందట. వీళ్లు తినేవాటిలో కెఫిన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుందని వాళ్లు గమనించారు.ప్రతి ఒక్కరి శరీరానికీ ఒక డే అండ్ నైట్ టైం టేబుల్ ఉంటుంది. దాని ప్రకారమే ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ ఆధారపడి ఉంటుంది.

లేట్ నైట్ టైం టేబుల్ వాళ్లు కొన్ని టిప్స్ పాటిస్తే రెగ్యులర్ టైం టేబుల్ లోకి మారిపోవచ్చట. ఇలాంటి వాళ్లను 21 మందిని తీసుకుని పరిశోధకులు స్టడీ చేశారు. వీళ్లు అర్ధరాత్రి రెండు దాటాక నిద్రపోతారు. ఉదయం తొమ్మిది గంటలకు మేల్కొంటారు. ఇలాంటి వాళ్లు ఈ టిప్స్ పాటించి చూడండి ఒకసారి.

ఇవి పాటించండి

మామూలుగా లేచే సమయం కన్నా 2,3 గంటలు ముందు లేవాలి.

ఉదయం శరీరానికి ఎండ తప్పక తగలాలి.

సాధ్యమైనంత త్వరగా బ్రేక్ ఫాస్ట్ చేసేయాలి.

రోజు వ్యాయామం చేయాలి. అదికూడా కేవలం ఉదయం మాత్రమే.

ప్రతి రోజూ ఒకే సమయంలో లంచ్ చేయాలి. సాయంత్రం ఏడు తర్వాత ఏమీ తినకూడదు.

మధ్యాహ్నం మూడింటి తర్వాత కెఫిన్ ఉండే పదార్ధాలేవి తీసుకోకూడదు.

సాయంత్రం నాలుగు గంటల తర్వాత కునుకు వచ్చినా నిద్ర పోకూడదు.

PolitEnt Media

PolitEnt Media

Next Story