Care for Premature Babies: ప్రీమెచ్యూర్ బేబీల సంరక్షణలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి పాలు పట్టడంతో పాటు బర్పింగ్ చేయించడం ముఖ్యం. సరైన నిద్ర కోసం అనువైన వాతావరణం సృష్టించాలి. వారికి రోజూ స్నానానికి బదులు స్పాంజ్ బాత్ చేయించాలి. వీరికి ఇన్ఫెక్షన్ల ముప్పూ ఎక్కువే. అలాగే వీరికి ఆరు నెలలు వచ్చేవరకు ప్రయాణాలు కూడా సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు. ఒక థర్మామీటర్‌, నెబ్యులైజర్‌ అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

నెలలు నిండక ముందే పుట్టినవారు చాలా సున్నితంగా ఉంటారు. కంటికి రెప్పలా జాగ్రత్తగా కాపాడుకోవాలంటున్నారు నిపుణులు. ముందే పుట్టడం వల్ల వీరికి కంటి సమస్యలు, వినికిడి లోపం, శ్వాస, మెదడు సమస్యలు, గుండె జబ్బులు, నరాలు, జీర్ణశయాంతర సమస్యలు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలు వచ్చే ప్రమాదం ఎక్కువ. పుట్టినప్పుడు వారి అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడమే దీనికి కారణమని చెబుతున్నారు.

వాతావరణం మారినపుడు, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినపుడు పిల్లల ఊపిరితిత్తుల్లో తెమడ చేరి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటప్పుడు మాత్రం నెబ్యులైజర్‌ వాడాలి. కానీ కొంతమంది ముక్కు దిబ్బడ, జలుబు వేగంగా తగ్గుతాయని సొంతంగానే నెబ్యులైజర్‌ వాడుతుంటారు. కానీ అది సరికాదు. డాక్టర్‌ సలహా మేరకే నెబ్యులైజర్‌ని ఉపయోగించాలి. ఒకవేళ పిల్లలకు అలర్జీ సమస్య ఉంటే అత్యవసర సమయంలో నెబ్యులైజర్‌ వాడచ్చు.

Next Story