డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..

Avoid Dehydration: దేశవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల వల్ల ప్రస్తుతం చాలా మంది లూజ్ మోషన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో శరీరం నుండి నీరు, ముఖ్యమైన ఖనిజ లవణాలు వేగంగా బయటకు వెళ్లిపోవడం వల్ల డీహైడ్రేషన్ ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డీహైడ్రేషన్ లక్షణాలు ఎలా ఉంటాయి?

శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. విపరీతమైన దాహం వేయడం, నోరు, గొంతు పొడిబారడం, మూత్రం పసుపు రంగులోకి మారడం, తీవ్రమైన నీరసం, తలతిరగడం, తలనొప్పి.

రోజుకు ఎంత నీరు త్రాగాలి?

సాధారణంగా ఒక ఆరోగ్యవంతుడు రోజుకు 2 నుండి 2.5 లీటర్ల నీరు త్రాగాలి. అయితే విరేచనాలు అవుతున్న సమయంలో శరీరం ఎలక్ట్రోలైట్లను కోల్పోతుంది కాబట్టి, ఆ మొత్తాన్ని 2.5 నుండి 3 లీటర్లకు పెంచడం అవసరమని ఆయన తెలిపారు.

ఏం త్రాగాలి? ఏం త్రాగకూడదు?

కేవలం నీరు మాత్రమే కాకుండా, శరీరానికి శక్తినిచ్చే ఇతర ద్రవాలను కూడా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు:

తీసుకోవలసినవి:

ORS ద్రావణం: ఇది శరీరంలోని ఎలక్ట్రోలైట్లను త్వరగా భర్తీ చేస్తుంది.

కొబ్బరి నీళ్లు: సహజ సిద్ధమైన ఖనిజాలను అందిస్తాయి.

నిమ్మరసం - పల్చటి మజ్జిగ: జీర్ణక్రియకు, హైడ్రేషన్‌కు మేలు చేస్తాయి.

తేలికపాటి సూప్‌లు: శరీరానికి అవసరమైన పోషకాలను ఇస్తాయి.

నివారించవలసినవి:

అధిక చక్కెర ఉండే కూల్ డ్రింక్స్.

కెఫీన్ అధికంగా ఉండే కాఫీ, టీలు.

సోడా వంటి ఫిజీ పానీయాలు.

ఇవి కడుపు సమస్యలను మరింత తీవ్రం చేసే అవకాశం ఉంది.

శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి మరియు అవయవాలు సక్రమంగా పనిచేయడానికి నీరు చాలా అవసరం. విరేచనాల సమయంలో నిర్లక్ష్యం వహిస్తే అది తీవ్ర బలహీనతకు దారితీస్తుంది. కాబట్టి, తగినంత నీరు త్రాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం ద్వారా ఈ ఆరోగ్య సమస్యల నుండి త్వరగా కోలుకోవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story