Boost Your Immunity: ప్రస్తుతం దేశవ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుంటే, మరికొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇలాంటి వాతావరణ మార్పుల సమయంలో జ్వరం, జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్, ఫ్లూ వంటి కాలానుగుణ వ్యాధులు విజృంభించడం సర్వసాధారణం. అయితే, ఈ ఇన్ఫెక్షన్ల బారిన పడటానికి ప్రధాన కారణం మన శరీరంలో బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ . వైద్య నిపుణుల ప్రకారం, రాత్రికి రాత్రే రోగనిరోధక శక్తిని పెంచే అద్భుత మాత్రలు ఏవీ లేవు. కానీ, స్థిరమైన ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం ద్వారా శరీరాన్ని లోపలి నుండి బలోపేతం చేసుకోవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు

మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందాలంటే రోజువారీ ఆహారంలో వీటిని భాగం చేసుకోవాలి..

సిట్రస్ పండ్లు:

నిమ్మ, నారింజ, బత్తాయి, గ్రేప్‌ఫ్రూట్ వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి అద్భుతంగా సహాయపడుతుంది.

నట్స్, గింజలు:

బాదం, గుమ్మడికాయ గింజలలో జింక్ లభిస్తుంది, ఇది రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది.

ఆకుకూరలు, కూరగాయలు:

సమతుల్య పోషకాల కోసం తృణధాన్యాలు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

భారతీయ వంటగది.. ఆరోగ్యాల గని..

మన ఇంట్లో ఉండే మసాలా దినుసులలో సహజ యాంటీ-వైరల్ మరియు యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉన్నాయి.

పసుపు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, దాల్చినచెక్కలను నిత్యం వంటల్లో వాడాలి.

రాత్రి పూట పసుపు పాలు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

* తులసి, పుదీనా, అల్లంతో చేసుకునే కషాయాలు సీజనల్ వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

నీరు, నిద్ర మరియు మానసిక ప్రశాంతత

హైడ్రేషన్:

శరీరం సరిగ్గా పనిచేయడానికి మరియు వ్యర్థాలు బయటకు పోవడానికి రోజంతా పుష్కలంగా నీరు త్రాగడం ముఖ్యం.

సరైన నిద్ర:

ప్రతిరోజూ తగినంత సమయం నిద్రపోకపోతే రోగనిరోధక వ్యవస్థ తీవ్రంగా బలహీనపడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒత్తిడి నియంత్రణ:

దీర్ఘకాలిక ఒత్తిడి శరీర నిరోధక శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ వ్యాయామం, యోగా లేదా ధ్యానం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి.

వీటికి దూరంగా ఉండండి

కాలానుగుణ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే కేవలం మంచి ఆహారం తీసుకోవడమే కాదు, హానికరమైన అలవాట్లకు దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యం..

జంక్ ఫుడ్, మితిమీరిన నూనె పదార్థాలు తగ్గించాలి.

శీతల పానీయాలు, చక్కెర పదార్థాలకు దూరంగా ఉండాలి.

ధూమపానం, మద్యపానం అలవాట్లు రోగనిరోధక శక్తిని నేరుగా దెబ్బతీస్తాయి కాబట్టి వాటిని నివారించడం ఉత్తమం.

PolitEnt Media

PolitEnt Media

Next Story