తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త..

Child Health Alert: పిల్లలు కదా.. పెరుగుతున్నారు, ఏది తింటే ఏముంది.. అని మీరు అనుకుంటున్నారా? అయితే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారు. నేటి ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి మన పిల్లలను చిన్న వయసులోనే గుండె రోగులుగా మారుస్తోంది. ప్యాక్ చేసిన ఆహారాలు, కూల్ డ్రింక్స్ పిల్లల ప్రాణాల మీదకు తెస్తున్నాయని వైద్యులు షాకింగ్ విషయాలను వెల్లడించారు.

ఫాస్ట్ ఫుడ్‌తో గుండెపై ఒత్తిడి..

చిప్స్, ప్యాక్ చేసిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన మాంసాలలో ఉప్పు స్థాయిలు విపరీతంగా ఉంటాయి. దీనివల్ల చిన్న వయసులోనే పిల్లల్లో రక్తపోటుపెరుగుతోంది. ఇది గుండెపై తీవ్ర ఒత్తిడిని కలిగించి, భవిష్యత్తులో గుండె జబ్బులకు ప్రధాన కారణమవుతోంది.

చక్కెరతో టైప్-2 డయాబెటిస్ ముప్పు

కూల్ డ్రింక్స్, క్యాండీలు, బేక్ చేసిన ఆహారాల్లో ఉండే అధిక చక్కెర వల్ల పిల్లల్లో ఊబకాయం పెరుగుతోంది. ఇది కేవలం బరువు పెరగడమే కాకుండా, రక్త నాళాలలో వాపును కలిగిస్తుంది. దీనివల్ల చిన్న వయసులోనే రక్త నాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఉప్పు వాడకంలో భారత్ రికార్డ్

ప్రపంచ ఆరోగ్య సంస్థ రోజుకు కేవలం 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలని సిఫార్సు చేస్తుంటే, భారతీయులు ఏకంగా 9 నుండి 11 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నారు. లాన్సెట్ అధ్యయనం ప్రకారం, భారత్‌లో దాదాపు 1.25 కోట్ల మంది పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారు.

తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు:

ప్యాకెట్ చెక్ చేయండి: పిల్లలకు ఏదైనా కొనే ముందు అందులో సోడియం, చక్కెర ఎంత ఉందో తనిఖీ చేయండి.

స్థానిక ఆహారమే ముద్దు: ప్రాసెస్ చేసిన ఫుడ్స్ మానేసి, పండ్లు, కూరగాయలు వంటి ఇంట్లో వండిన ఆహారాన్ని అలవాటు చేయండి.

కూల్ డ్రింక్స్‌కు నో చెప్పండి: కోలాలు, ఎనర్జీ డ్రింక్స్ బదులు నీరు, తాజా పండ్ల రసాలు లేదా స్మూతీలు ఇవ్వండి.

PolitEnt Media

PolitEnt Media

Next Story