ఆరోగ్యానికి ఏది మంచిది?

Copper Bottle Vs Steel Bottle: శరీరానికి తగినంత నీరు అందించడం చాలా ముఖ్యం. ప్రస్తుతం ప్లాస్టిక్ వాడకం తగ్గించి, ప్రజలు ఎక్కువగా స్టీల్ లేదా రాగి సీసాలను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఈ అంశంపై పూర్తి వివరాలను తెలుసుకుందాం.

రాగి బాటిల్: ఆయుర్వేద ప్రయోజనాలు

ఆయుర్వేదం ప్రకారం, రాగి పాత్రలలో నిల్వ చేసిన నీటికి ఔషధ గుణాలు ఉంటాయి. నీటిని కనీసం 8 గంటలు రాగి పాత్రలో ఉంచితే, రాగిలోని ఖనిజాలు నీటిలో కలిసిపోయి, ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

జీర్ణక్రియ మెరుగు: రాగి నీరు జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచి, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

నీటి శుద్ధి: రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు సహజంగానే క్రిములను తొలగించి, నీటిని శుద్ధి చేస్తుంది.

హార్మోన్ల సమతుల్యత: రాగి నీరు థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచి, హార్మోన్ల సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతుంది.

శుభ్రత ముఖ్యం: రాగి సీసాలు వాడేవారు వాటిని ప్రతిరోజూ శుభ్రంగా కడగడం చాలా ముఖ్యం.

స్టీల్ బాటిల్: మన్నిక, సౌలభ్యం

రాగి నీటిలో ఉన్న ఔషధ గుణాలు స్టీల్ బాటిల్స్‌లో లేనప్పటికీ, దీనికి దాని ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి.

సురక్షితం: ప్లాస్టిక్ బాటిళ్లలా కాకుండా స్టీల్ బాటిళ్లు నీటిని కలుషితం చేయవు. ఎంతసేపు నిల్వ చేసినా నీటి రుచిలో మార్పు రాదు.

మన్నిక: స్టెయిన్‌లెస్ స్టీల్ తుప్పు పట్టదు, అందుకే ఇది ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.

ఉష్ణోగ్రత: కొన్ని ఇన్సులేటెడ్ స్టీల్ బాటిల్స్ నీటి ఉష్ణోగ్రతను ఎక్కువ కాలం స్థిరంగా ఉంచుతాయి.

పర్యావరణానికి మేలు: స్టీల్ బాటిళ్లను పూర్తిగా రీసైకిల్ చేయవచ్చు, ఇది పర్యావరణానికి హానికరం కాదు.

మీ ఆరోగ్యం, సౌలభ్యం ఆధారంగా మీరు సరైన బాటిల్‌ను ఎంచుకోవచ్చు. రాగి బాటిల్ అదనపు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుండగా, స్టీల్ బాటిల్ ఎక్కువ కాలం మన్నికగా ఉండి, ఉపయోగించడానికి సులువుగా ఉంటుంది. రాగి బాటిల్ ఉపయోగిస్తే పరిశుభ్రత విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ అవసరాలకు అనుగుణంగా సరైన బాటిల్‌ను ఎంచుకోవడం మంచిది.

PolitEnt Media

PolitEnt Media

Next Story