అసలు నిజం ఏమిటి?

Salty Foods Increase Diabetes Risk: చాలామందికి ఉప్పగా ఉండే ఆహార పదార్థాలు తింటే చక్కెర స్థాయిలు పెరగవనే అభిప్రాయం ఉంది. కానీ, నేటి కాలంలో లభించే ప్యాక్ చేసిన , ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు ఈ అంచనాలను తలకిందులు చేస్తున్నాయి.

దాగి ఉన్న చక్కెర: ఉప్పుగా అనిపించే చాలా స్నాక్స్ తయారీలో రుచి కోసం, నిల్వ ఉండటం కోసం చక్కెర లేదా కార్న్ సిరప్‌ను ఉపయోగిస్తారు. ఇది మనకు తెలియకుండానే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది.

ప్రిజర్వేటివ్‌ల ప్రభావం:

ప్యాకెట్ ఫుడ్స్ ఎక్కువ కాలం పాడవకుండా ఉండటానికి వాడే రసాయనాలు శరీర జీవక్రియపై ప్రభావం చూపిస్తాయి.

మీరు ప్రమాదకరమైన ఆహారాలు తింటున్నారా?

మార్కెట్లో దొరికే ఈ క్రింది పదార్థాల విషయంలో మధుమేహ బాధితులు మరియు ఆరోగ్యవంతులు కూడా జాగ్రత్తగా ఉండాలి:

ప్యాకెట్ స్నాక్స్: ఇవి ఉప్పగా ఉన్నప్పటికీ, వీటిలో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి.

చిప్స్: వీటిలో సోడియం (ఉప్పు) తో పాటు అధిక కేలరీలు ఉంటాయి.

ఉప్పు బిస్కెట్లు: చాలా మంది సాల్ట్ బిస్కెట్లు సురక్షితం అనుకుంటారు. కానీ వీటి తయారీలో వాడే మైదా, షుగర్ అంశాలు డయాబెటిస్‌కు హానికరం.

ప్రాసెస్ చేసిన ఆహారం:

ఇన్‌స్టంట్ నూడుల్స్, సాస్‌లు, రెడీ-టు-ఈట్ ప్యాకెట్లలో చక్కెర, కార్న్ సిరప్ మరియు ప్రిజర్వేటివ్‌లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లెవల్స్‌ను వేగంగా పెంచుతాయి.

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సూచనలు:

లేబుల్స్ చదవండి: ఏదైనా ప్యాక్ చేసిన ఆహారం కొనేముందు దాని వెనుక ఉండే షుగర్ కంటెంట్, సోడియం పరిమాణాన్ని తప్పనిసరిగా తనిఖీ చేయండి.

సహజ ఆహారం: వీలైనంత వరకు తాజా పండ్లు, కూరగాయలు, ఇంట్లో తయారు చేసిన తక్కువ ఉప్పు, కారం ఉన్న ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వండి.

నీరు, వ్యాయామం: శరీరంలోని అదనపు సోడియంను బయటకు పంపడానికి పుష్కలంగా నీరు త్రాగాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story