Drink Water Immediately After Waking Up: రోజూ ఉదయం నిద్రలేవగానే నీళ్లు తాగే అలవాటు ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరానికి నీరు అందించడం వల్ల సాధారణ హైడ్రేషన్ అవసరాలు తీరుతాయి. అయితే ఉదయం మాత్రమే కాకుండా రోజంతా తగినంత నీరు తాగడం కూడా ముఖ్యమే.

చాలామంది ఉదయం లేవగానే టీ, కాఫీలతో రోజును ప్రారంభిస్తుంటారు. కానీ ముందుగా ఒక గ్లాసు నీళ్లు తాగడం మంచి అలవాటు. ముఖ్యంగా రాత్రి సమయంలో శరీరానికి నీరు అందకపోవడంతో ఉదయం దాహం వేయవచ్చు.

నీళ్లు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణ, జీర్ణక్రియ, పోషకాల రవాణా వంటి ముఖ్యమైన పనులకు సహాయం అందుతుంది. తగినంత నీరు తాగడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గడానికి కూడా తోడ్పడుతుంది.

అయితే ఉదయం పరగడుపున ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగితే శరీరంలోని విషపదార్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయనే ప్రచారానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. శరీరంలోని వ్యర్థాలను తొలగించే పనిని ప్రధానంగా మూత్రపిండాలు, కాలేయం నిర్వహిస్తాయి.

అందుకే ఉదయం నిద్రలేవగానే దాహానికి అనుగుణంగా నీళ్లు తాగడం, రోజంతా తగినంత ద్రవాలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story