Health:మనం జామ పండు తింటాం కానీ..జామ ఆకులను పెద్దగా పట్టించుకోం. అయితే జామ ఆకులు ఆరోగ్యానికి అద్భుతమైన సహజ ఔషధం అని చాలా మందికి తెల్వదు . ఇవి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. జామ ఆకులను నమలడం లేదా టీ గా తాగడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. జీర్ణక్రియను మెరుగుపరచుకోవచ్చు. అనేక ఇతర ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.

జామ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు,విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి.ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జామ ఆకులు జీర్ణవ్యవస్థను మెరుగుపర్చేందుకు, జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇక షుగర్ ఉన్నవారికి మంచి ఔషధం. జామ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. తద్వారా షుగర్ కంట్రోల్ చేయొచ్చు. జామ ఆకులతో గుండె ఎంతో ఆరోగ్యం అంటున్నారు నిపుణులు. జామ ఆకులు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తాయంటున్నారు.

Updated On
Next Story