పాలతో కలిగే మేలు ఏంటో తెలుసా ?

Benefits of Mother's Milk: తల్లి పాలతో శిశువుకు, తల్లికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, బిడ్డ పుట్టిన మొదటి ఆరు నెలలు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వడం ఉత్తమం.తల్లి పాలు బిడ్డకు ఒక సంపూర్ణమైన ఔషధం లాంటివి, ఇవి పోషకాలను అందించడంతో పాటు రక్షణ కవచంగా పనిచేస్తాయి.తల్లి పాలలో శిశువు ఎదుగుదలకు, మెదడు వికాసానికి అవసరమైన అన్ని పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు సరైన మోతాదులో ఉంటాయి. మొదటి కొన్ని రోజుల పాటు వచ్చే ముర్రుపాలు అత్యంత ముఖ్యమైనవి. తల్లి పాలలో ఉండే యాంటీబాడీలు శిశువును అంటువ్యాధులు, జలుబు, విరేచనాలు చెవి ఇన్ఫెక్షన్లు, ఇతర అనారోగ్యాల నుండి రక్షిస్తాయి. తల్లి పాలు తేలికగా జీర్ణమవుతాయి. వీటిని తాగే పిల్లల్లో మలబద్ధకం సమస్య తక్కువగా ఉంటుంది. తల్లి పాలు తాగే పిల్లలు ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉంటారు. భవిష్యత్తులో స్థూలకాయం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. తల్లి పాలివ్వడం ద్వారా బిడ్డ తల్లితో సాన్నిహిత్యం ఏర్పరచుకోవడం వల్ల మానసిక, భావోద్వేగ వికాసం మెరుగవుతుంది. తల్లి పాలు తాగే పిల్లలకు భవిష్యత్తులో ఆస్తమా అలెర్జీలు, డయాబెటిస్ ,కొన్ని రకాల క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story