ప్రయోజనాలు తెలుసా.?

Health Benefits of Olive Oil: ఆలివ్ ఆయిల్ ..ఆలివ్ పండ్ల నుండి తీసే నూనె, ఇది మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు (MUFA), యాంటీఆక్సిడెంట్లు ,విటమిన్లతో నిండి ఉంటుంది .ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా మధ్యధరా ఆహారపు అలవాట్లలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

1. గుండె ఆరోగ్యానికి మేలు

ఇందులో ఉండే మోనో-అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ,శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను ,తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.

ఆలివ్ ఆయిల్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.

2. చర్మ సంరక్షణ

ఇది చర్మానికి మంచి తేమను అందిస్తుంది. స్నానానికి ముందు దీనితో మసాజ్ చేసుకుంటే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.

ఇందులో ఉండే విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలను తగ్గించి, వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా చేస్తాయి.

చిన్న పిల్లలకు ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేయడం వల్ల వారి ఎముకలు దృఢంగా మారుతాయి ,చర్మం మృదువుగా ఉంటుంది.

3. బరువు తగ్గడం, జీర్ణం

ఇతర నూనెలతో పోలిస్తే ఆలివ్ ఆయిల్ వాడటం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది ,మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది.

4. మెదడు ఆరోగ్యం

ఆలివ్ ఆయిల్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అల్జీమర్స్ వంటి మతిమరుపు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

5. మధుమేహం

రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో,ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో ఆలివ్ ఆయిల్ దోహదపడుతుంది.

ఎలా ఉపయోగించాలి?

సలాడ్లు: ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్‌ను సలాడ్‌లపై డ్రెస్సింగ్‌గా వాడుకోవడం ఉత్తమం.

వంట: వేపుళ్లకు (Deep Fry) కాకుండా, తక్కువ మంట మీద చేసే వంటలకు లేదా కూరల పైన గార్నిష్‌గా వాడటం మంచిది.

మోతాదు: రోజుకు 1 నుండి 2 టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకోవడం సరిపోతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story