Foods with Coffee: కాఫీతో ఈ ఆహారాలు కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..?
ఏమవుతుందో తెలుసా..?

Foods with Coffee: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తమ రోజును కాఫీతోనే ప్రారంభిస్తారు. అయితే పోషకాహార నిపుణులు మాత్రం కాఫీ తాగే ముందు లేదా తర్వాత కొన్ని రకాల ఆహారాలను తీసుకోకూడదని సూచిస్తున్నారు. ఎందుకంటే కాఫీలోని కొన్ని పదార్థాలు ఆహారంలోని పోషకాలను గ్రహించడాన్ని అడ్డుకుంటాయి.
కాఫీతో పాటు తినకూడనివి
సిట్రస్ పండ్లు: ద్రాక్ష, నారింజ వంటి సిట్రస్ పండ్లను కాఫీతో కలిపి తినకూడదు. ఇలా చేయడం వల్ల శరీరంలో ఆమ్లత్వం పెరుగుతుంది. ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.
ఎర్ర మాంసం: ఎర్ర మాంసం తిన్న తర్వాత కాఫీ తాగడం మానుకోవాలి. కాఫీ మాంసం జీర్ణం కావడాన్ని ఆలస్యం చేస్తుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై భారం పడుతుంది.
పాల ఉత్పత్తులు: పాలు కలిపిన కాఫీ తాగడం వల్ల పాలలో ఉండే కాల్షియం శరీరానికి పూర్తిగా అందకుండా నిరోధించబడుతుంది. అందుకే బ్లాక్ కాఫీ తాగడం మంచిది.
జంక్ ఫుడ్ - వేయించిన ఆహారాలు: స్నాక్స్, జంక్ ఫుడ్ లేదా వేయించిన ఆహారాలు తిన్న తర్వాత కాఫీ తాగకూడదు. ఇది అనవసరంగా కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది.
ధాన్యాలు: ధాన్యాలు తిన్న వెంటనే కాఫీ తాగడం వల్ల వాటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు శరీరం సరిగా గ్రహించలేదు.
పోషకాహార నిపుణుల ప్రకారం, కాఫీని మితంగా తాగడం ఆరోగ్యానికి మంచిదే. కానీ దానితో పాటు ఏ ఆహారాలను తీసుకోకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
