Black Coffee: బ్లాక్ కాఫీ తాగితే ఆయుష్షు పెరుగుతుందా..?
ఆయుష్షు పెరుగుతుందా..?

Black Coffee: కాఫీ మంచిది కాదని, అది శరీరంలో వ్యసనాన్ని కలిగిస్తుందని చెప్పి కాఫీకి దూరంగా ఉండేవాళ్ళు, దయచేసి ఒక్క క్షణం వినండి.. కాఫీ మంచిది. ఒక కొత్త అధ్యయనం ప్రకారం, కాఫీ ఆయుర్దాయం పెంచుతుందని తేలింది. అది పాలతో చేసిన కాఫీ కాదు. బ్లాక్ కాఫీ. అవును బ్లాక్ కాఫీ వల్ల మన ఆయుష్షు పెరుగుతుందని పరిశోధనలో తేలింది. అంతేకాకుండా దీని వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
టఫ్ట్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో కాఫీ తాగని వారి కంటే కాఫీ తాగే వారు చనిపోయే అవకాశం తక్కువ అని తేలింది. రోజుకు ఒక కప్పు కాఫీ తాగడం వల్ల మరణ ప్రమాదం 16% తగ్గుతుండగా, 2-3 కప్పులు తాగడం వల్ల దీనిని 17శాతం వరకు తగ్గించవచ్చు. మూడు కంటే ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయని ఆశించవద్దు.
పరిశోధకులు ప్రతిరోజూ పాలు, చక్కెరతో కాఫీ తాగడాన్ని ప్రోత్సహించడం లేదు. కాఫీ బదులుగా బ్లాక్ కాఫీ తాగాలని సూచిస్తున్నారు. కాఫీ కంటే బ్లాక్ కాఫీ వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు.
