బరువు పెరుగుతారా?

Eating Rice at Night: రాత్రిపూట అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారా లేదా అనే దానిపై నిపుణుల మధ్య భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కానీ చాలామంది నిపుణులు చెప్పేది ఏమిటంటే, కేవలం రాత్రిపూట అన్నం తినడం వల్లనే బరువు పెరగరు. మీరు రోజంతా తీసుకునే మొత్తం కేలరీలు, శారీరక శ్రమ బరువు పెరగడం లేదా తగ్గడంపై ప్రధానంగా ప్రభావం చూపుతాయి.

రాత్రిపూట మన జీవక్రియలు కొంతవరకు నెమ్మదిస్తాయి. అన్నంలో ఎక్కువగా పిండి పదార్థాలు ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్లు త్వరగా జీర్ణమై శక్తిగా మారతాయి. కానీ, రాత్రిపూట మనం తక్కువ శారీరక శ్రమ చేస్తాం కాబట్టి, ఆ శక్తి ఉపయోగపడకుండా కొవ్వుగా మారి శరీరంలో నిల్వ అవుతుంది.

సాధారణంగా రాత్రిపూట మనం అన్నం ఎక్కువ మోతాదులో తీసుకుంటాం. దీంతోపాటు కూరలు, పెరుగు వంటివి కూడా ఎక్కువగా తీసుకుంటాం. ఈ అధిక కేలరీలన్నీ మన శరీరంలో పేరుకుపోయి బరువు పెరగడానికి కారణమవుతాయి. కొంతమందికి రాత్రిపూట భారీ భోజనం చేయడం వల్ల అజీర్తి సమస్యలు వస్తాయి. దీనివల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు. మంచి నిద్ర లేకపోవడం కూడా బరువు పెరగడానికి ఒక కారణం. రాత్రిపూట అన్నం తినడం మానుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, అన్నం మన శరీరానికి అవసరమైన శక్తిని, పోషకాలను అందిస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story