Endometriosis Affect: ఎండోమెట్రియోసిస్ ఉంటే పిల్లలు పుట్టరా?
పిల్లలు పుట్టరా?

Endometriosis Affect: మహిళల్లో ఎండోమెట్రియల్ లైనింగ్ మందంగా ఉంటే నెలసరిలో బ్లీడింగ్ ఎక్కువరోజులు కావడం, నొప్పి, స్పాటింగ్ వంటివి ఉంటాయి. దీన్నే ఎండోమెట్రియోసిస్ అంటారు. దీని తీవ్రతను బట్టి గర్భధారణ సమయంలో పలు ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు నిపుణులు. ఈ సమస్య ఉన్నవారిలో అబార్షన్, ప్రీటర్మ్ డెలివరీ వంటివి జరిగే అవకాశం ఉంటుంది.
ఎండోమెట్రియోసిస్ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. సాధారణంగా పెల్విక్ నొప్పి, పీరియడ్స్‌లో నొప్పి, హెవీ బ్లీడింగ్, స్పాటింగ్, ప్రేగు కదలిక నొప్పి, మూత్రవిసర్జన సమయంలో నొప్పి, సంతానలేమి ఉంటాయి. హార్మోన్ థెరపీ తీసుకోవడం కొన్నిసార్లు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ఇవి ఎండోమెట్రియోసిస్ కణాల వృద్ధిని నియంత్రణలో ఉంచుతాయి. కొందరిలో లాప్రోస్కోపిక్ సర్జరీ అవసరం పడుతుందంటున్నారు నిపుణులు.
ఎండోమెట్రియోసిస్ ఉన్న మహిళలకు అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎండోమెట్రియాయిడ్ కార్సినోమా, క్లియర్ సెల్ కార్సినోమాను అభివృద్ధి చేస్తుందంటున్నారు. వీటిని గుర్తించేందుకు MRI/అల్ట్రాసౌండ్ చేస్తారు. రిపోర్ట్స్‌లో అసాధారణ లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే.. శస్త్రచికిత్స ద్వారా దానిని తొలగించాల్సి ఉంటుంది. జీవనశైలి మార్పులు చేసుకుంటే ఈ ముప్పును తగ్గించొచ్చని చెబుతున్నారు.

