ఇది నిజమా లేక భ్రమా? నిపుణులు ఏం చెబుతున్నారు..

Smoking Really Reduce Stress: చాలా మంది ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా ఆందోళనగా అనిపించినప్పుడు వెంటనే సిగరెట్ వెలిగిస్తారు. ఒక్క దమ్ కొడితే రిలాక్స్‌గా ఉంటుంది అనేది వారి వాదన. కానీ, నిజంగానే ధూమపానం ఒత్తిడిని తగ్గిస్తుందా? లేక మనల్ని మరింత ప్రమాదంలోకి నెడుతుందా? ఈ విషయంపై వాస్తవాలను క్లుప్తంగా తెలుసుకుందాం.

నికోటిన్ ఇచ్చే ఆ క్షణిక ఉపశమనం ఏంటి? పొగాకులో నికోటిన్ అనే శక్తివంతమైన రసాయనం ఉంటుంది. ఇది రక్తంలో కలవగానే మెదడులో డోపమైన్ వంటి ఫీల్ గుడ్ హార్మోన్లను విడుదల చేస్తుంది.

సిగరెట్ తాగిన వెంటనే కొన్ని నిమిషాల పాటు మనసు ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ ఉపశమనం కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. నికోటిన్ ప్రభావం తగ్గగానే శరీరం మళ్ళీ నికోటిన్ కోసం తపిస్తుంది.

అసలు చిక్కు ఇక్కడే ఉంది

ధూమపానం ఒత్తిడిని తగ్గించకపోగా కాలక్రమేణా దాన్ని రెట్టింపు చేస్తుంది. శరీరంలో నికోటిన్ స్థాయిలు తగ్గగానే చిరాకు, ఆందోళన, విశ్రాంతి లేకపోవడం మొదలవుతాయి. ఈ అసహనాన్ని తగ్గించుకోవడానికి వ్యక్తి మళ్ళీ సిగరెట్ తాగుతాడు. అంటే సిగరెట్ ఒత్తిడిని తగ్గించడం లేదు, సిగరెట్ మానడం వల్ల కలిగే విత్ డ్రాయల్ ఒత్తిడిని మాత్రమే తాత్కాలికంగా ఆపుతోంది. దీర్ఘకాలంలో ఇది ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలు,నిద్రలేమికి దారితీస్తుంది.

ఒత్తిడిని జయించడానికి ఆరోగ్యకరమైన మార్గాలు

సిగరెట్‌కు బానిస అవ్వకుండా, సహజ సిద్ధంగా ఒత్తిడి నుండి బయటపడటానికి ఈ అలవాట్లను ప్రయత్నించండి.

వ్యాయమం - యోగా : శరీరంలో ఎండార్ఫిన్‌లను విడుదల చేసి సహజంగా ఉత్సాహాన్ని ఇస్తుంది.

ధ్యానం : మనస్సుకు ప్రశాంతతను చేకూర్చి, ఏకాగ్రతను పెంచుతుంది.

సరైన ఆహారం : చక్కెర, కెఫిన్ తగ్గించి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల మూడ్ స్థిరంగా ఉంటుంది.

సామాజిక బంధాలు ఒంటరిగా పొగ తాగడం కంటే, స్నేహితులు లేదా కుటుంబంతో మాట్లాడటం మేలు.

అభిరుచులు : పెయింటింగ్, గార్డెనింగ్ వంటి పనులు మీలో సానుకూలతను నింపుతాయి.

సిగరెట్ ఇచ్చే ఉపశమనం ఒక అబద్ధం. అది మీ సమస్యను పరిష్కరించదు సరే కదా, కొత్త ఆరోగ్య సమస్యలను కొనితెస్తుంది. కాబట్టి, ధూమపానానికి స్వస్తి చెప్పి ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకోండి.

PolitEnt Media

PolitEnt Media

Next Story